Revanth Reddy: అల్లు అర్జున్‌ ఇంటిపై దాడి స్పందించిన సీఎం

ABN , Publish Date - Dec 23 , 2024 | 08:48 AM

అల్లు అర్జున్‌ ఇంటిపై ఓయూ జేఏసీ నేతల దాడి ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన ఈ మేరకు ట్వీట్‌ చేశారు.


అల్లు అర్జున్‌ (Allu Arjun) ఇంటిపై ఓయూ జేఏసీ (Ou Jac Attacks) నేతల దాడి ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Cm Revanth reddy) స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన ఈ మేరకు ట్వీట్‌ చేశారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ‘సినీ ప్రముఖుల ఇళ్ల పై దాడి ఘటనను ఖండిస్తున్నాను. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు. సంధ్య థియేటర్‌ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ట్వీట్‌ చేశారు.  



ఇదే విషయంపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పందించారు. ‘హైదరాబాద్‌లోని నటుడు అల్లు అర్జున్‌ నివాసంపై రాళ్ల దాడి ఘటన, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలను దిగ్ర్భాంతికి గురిచేస్తోంది. పౌరులకు రక్షణ కల్పించడంలో, పరిపాలన అసమర్థతను ఇలాంటి సంఘటనలు ప్రతిబింబిస్తాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కళాకారులను, సినీ పరిశ్రమను టార్గెట్‌ చేయడం ప్రమాదకరమైన ఆనవాయితీగా మారింది’ అంటూ ట్వీట్‌ చేశారు కిషన్‌ రెడ్డి

 

Updated Date - Dec 23 , 2024 | 08:48 AM