Double ISMART: రామ్, పూరి జగన్నాధ్ ‘డబుల్ ఇస్మార్ట్’ కౌంట్ డౌన్ షురూ

ABN , Publish Date - Jun 27 , 2024 | 10:51 AM

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ జంట‌గా డబుల్ ఇస్మార్ట్ చిత్రంతో వస్తున్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. మూవీ విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో తాజాగా 50 రోజుల కౌంట్‌డౌన్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

Double ISMART: రామ్, పూరి జగన్నాధ్ ‘డబుల్ ఇస్మార్ట్’ కౌంట్ డౌన్ షురూ
ram

ఉస్తాద్ రామ్ పోతినేని (RAm POthineni), డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ (Puri Jagannadh) జంట‌గా తమ మ్యాసీవ్ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ (Double ISMART) చిత్రంతో వస్తున్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అంతేగాక‌ సినిమాలో సంజయ్ దత్ (Sanjay Dutt) విలన్‌గా చేస్తుండ‌డంతో చిత్రంపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి. ఇప్ప‌టికే గ్రిప్పింగ్ స్టోరీ లైన్, హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఎక్సయిట్మెంట్, ఎంటర్టైన్మెంట్ ని న్యూ లెవల్‌లో అందిస్తామ‌ని చిత్ర యూనిట్ పేర్కొన‌డంతో అభిమానులు సినిమా కోసం ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

Double-ismart.jpg

అయితే.. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఆగష్టు 15న స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేక‌ర్స్‌ అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో మూవీ విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో తాజాగా 50 రోజుల కౌంట్‌డౌన్‌ను మార్కింగ్ చేస్తూ మేకర్స్ రామ్ పోతినేని (RAm POthineni) స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రామ్‌(RAm POthineni)కు జోడీగా కావ్య థాపర్ (Kavya Thapar) నటిస్తోండ‌గా పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ క‌లిసి చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 15న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ డబుల్ ఇస్మార్ట్ సినిమా విడుదల కానుంది.


GQ-sp4kXcAAiUKD.jpeg

ప్రస్తుతం హైదరాబాద్‌లో డబుల్ ఇస్మార్ట్ (Double ISMART) టైటిల్ సాంగ్ షూట్ జరుగుతోండ‌గా ప్రేక్షకులకు విజువల్, ఆడిటరీ ట్రీట్ ఉండేలా చూసేందుకు టీమ్ కేర్ తీసుకుంటుంది. పక్కా చార్ట్‌బస్టర్ అయ్యే ఈ పాటలో రామ్ పోతినేని (RAm POthineni) సిగ్నేచర్ ఎనర్జిటిక్ స్టైల్‌లో ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ మూవ్‌లు, విజువల్స్‌ అద్భుతంగా ఉండబోతున్నట్లు స‌మాచారం. మణిశర్మ (Mani Sharma) కంపోజ్ చేసిన ఎనర్జిటిక్ మాస్ సాంగ్ కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. త్వరలో సాంగ్ రిలీజ్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.

Updated Date - Jun 27 , 2024 | 10:51 AM