Record Break: సినిమా బాగోకపోతే ఎవరూ రావద్దు.. బాగుంటే సపోర్ట్ చేయండి

ABN , Publish Date - Mar 07 , 2024 | 11:35 PM

మహాశివరాత్రి సందర్భంగా పాన్ ఇండియా మూవీ ‘రికార్డ్ బ్రేక్’ ఘనంగా విడుదలకు సిద్ధమైంది. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై చదలవాడ పద్మావతి నిర్మించారు. చదలవాడ శ్రీనివాసరావు దర్శకుడు. ఈ సినిమాకు వేసిన ప్రీమియర్ షోలకు మంచి స్పందన రావడంతో టీమ్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సినిమా బాగోకపోతే ఎవరూ రావద్దు.. బాగుంటే సపోర్ట్ చేయండని దర్శకుడు కోరారు.

Record Break: సినిమా బాగోకపోతే ఎవరూ రావద్దు.. బాగుంటే సపోర్ట్ చేయండి
Record Break Press Meet

మహాశివరాత్రి సందర్భంగా పాన్ ఇండియా మూవీ ‘రికార్డ్ బ్రేక్’ (Record Break) ఘనంగా విడుదలకు సిద్ధమైంది. నిహార్ కపూర్, యాక్టర్ నాగార్జున, సత్య కృష్ణ, టి. ప్రసన్నకుమార్, రగ్ధా ఇఫ్తాకర్, సంజన, శాంతి తివారి, సోనియా, కాశీ విశ్వనాథ్ ప్రధాన పాత్రలలో నటించిన పాన్ ఇండియా మూవీ ‘రికార్డ్ బ్రేక్’. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై చదలవాడ పద్మావతి నిర్మించారు. చదలవాడ శ్రీనివాసరావు (Chadalavada Srinivasa Rao) దర్శకుడు. ఈ సినిమాకు వేసిన ప్రీమియర్ షోలకు మంచి స్పందన రావడంతో టీమ్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో

దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల నుంచి కష్టపడి తయారు చేసిన మా సినిమా ‘రికార్డ్ బ్రేక్’ శుక్రవారం రిలీజ్ కాబోతోంది. ఇన్ని సినిమాలు చేసినా ఎప్పుడూ ఈ సినిమాను ప్రమోట్ చేయండి అని అడగలేదు కానీ ఈ ‘రికార్డ్ బ్రేక్’ సినిమా మీడియా ప్రేక్షకులు అందరూ ప్రమోట్ చేసే సక్సెస్ చేయాలని కోరుతున్నాను. ఇది ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. మార్నింగ్ షో ఓపెనింగ్స్ మంచిగా వస్తే ఈవినింగ్ కల్లా సినిమా కచ్చితంగా పుంజుకుంటుంది. మార్నింగ్ షో కి వచ్చి చూడండి సినిమా బాగోకపోతే ఎవరూ రావద్దు బాగుంటే మటుకు ఖచ్చితంగా సినిమా ని సపోర్ట్ చేయాలి అని నా విన్నపం. ఒక కథానాయకుడు, కథానాయకి అనేదానికి ఈ సినిమా ద్వారా ఒక గొప్ప నిర్వచనం చెప్పబోతున్నాం. ఒక గొప్ప చిత్రం తీశానని గర్వంగా చెప్పగలను. ఇటువంటి సినిమాలను ఆదరిస్తే నాలాంటి ఎంతోమంది దర్శకులు ఇండస్ట్రీకి వస్తారు. కొత్త డైరెక్టర్లకి కొత్త ఆర్టిస్టులకి ఎంతో మంది ఇండస్ట్రీకి రావడానికి ఒక పునాది లాంటి సినిమా ఇది. ఐదేళ్ల కష్టం నాతోపాటు ఉండి నాలో భాగమైన అజయ్, కో డైరెక్టర్ రాఘవ, నాకు సహకరించిన నా ఆర్టిస్టులు, టెక్నీషియన్ టీం, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. అంగిరెడ్డి శ్రీనివాస్ అందించిన కథ డిఓపిగా కంతేటి శంకర్ పనితీరు చాలా బాగున్నాయి. చలపతి రావు ఈ సినిమాలో నటించడం సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించి పెద్ద సక్సెస్ చేయాలి మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.


Record-Break.jpg

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ (T Prasanna Kumar) మాట్లాడుతూ.. కరోనా కాలంలో పేస్టింగ్ బాయ్స్ దగ్గర నుంచి ఎగ్జిక్యూటివ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కష్టంలో ఉన్న అందరిని ఆదుకున్న వ్యక్తి చదలవాడ శ్రీనివాసరావు. మనం ఎదుటివారికి సేవ చేస్తే దేవుడు మనకు పదింతలు ఇస్తాడు అని నమ్మి ఉండే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఈ రోజున ఈ ‘రికార్డు బ్రేక్’ సినిమా చేశారు. ఒక మంచి సబ్జెక్ట్ ఎంచుకుని ఈ సినిమా తీశారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు అలాగే రైతుల గురించి అదేవిధంగా ప్రతి భారతీయుడు గర్వించే సినిమా ఇది. ఇద్దరు అనాధలు వరల్డ్ రెజ్లింగ్ వరకు ఎలా వెళ్లారు అనే కాన్సెప్ట్ చాలా బాగా చిత్రీకరించారు. ప్రేక్షకుల సినిమాను చూసి సపోర్ట్ చేయాలని కోరుతున్నానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని.. సినిమాను సక్సెస్ చేయాల్సిందిగా ప్రేక్షకులను కోరారు.

Updated Date - Mar 07 , 2024 | 11:35 PM