Ravibabu: అవును... మొదట అతనినే హీరోగా అనుకున్నా!

ABN , Publish Date - Jun 09 , 2024 | 04:21 PM

నటుడు, దర్శకుడు రవిబాబు (Ravibabu) స్టైలే వేరు. ఆయన ఎంచుకునే కథలు వైవిధ్యభరితంగా ఉంటాయి. ఆయన దర్శకత్వంలో రూపొందిన హారర్‌ థ్రిల్లర్‌ సినిమా ‘అవును’.

Ravibabu: అవును... మొదట అతనినే హీరోగా అనుకున్నా!

నటుడు, దర్శకుడు రవిబాబు (Ravibabu) స్టైలే వేరు. ఆయన ఎంచుకునే కథలు వైవిధ్యభరితంగా ఉంటాయి. ఆయన దర్శకత్వంలో రూపొందిన హారర్‌ థ్రిల్లర్‌ సినిమా ‘అవును’ (Avunu). ఇందులోని కథానాయకుడి పాత్ర కోసం తొలుత విజయ్‌ దేవరకొండను (Vijay Devarakonda) అనుకున్నారట రవిబాబు. తాజాగా రవిబాబు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘మీ విషయంలో విజయ్‌ హర్ట్‌ అయ్యారట. నిజమేనా?’ అని యాంకర్‌ అడగ్గా దానిపై స్పందిస్తూ ‘అవును’ గురించి చెప్పుకొచ్చారు.

రవిబాబు మాట్లాడుతూ ‘‘విజయ్‌ దేవరకొండ హర్ట్‌ అయ్యాడనే విషయం నాకు తెలియదు. నాతో ఎప్పుడూ చెప్పలేదు. నా దర్శకత్వంలో విజయ్‌ ‘నువ్విలా’ చిత్రంలో నటించాడు. నాకు తెలిసిన ఓ వ్యక్తి అతనిని పరిచయం చేశారు. నేననుకున్న ఓ పాత్రకు అతడు బాగుంటాడని అనిపించి, ఎంపిక చేశా. తర్వాత మూడు యాడ్స్‌కు మేం కలిసి పనిచేశాం. ‘అవును’లోని హీరో పాత్రకు విజయ్‌నే అనుకున్నా. కానీ, ఆ సమయానికి అతడు అందుబాటులో లేకపోవడంతో హర్షవర్థన్‌ రాణేను తీసుకోవాల్సి వచ్చింది. విజయ్‌తో ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నా. ఇటీవల విడుదలైన ‘ఫ్యామిలీ స్ట్టార్‌’లో విజయ్‌తో కలిసి నటించా’’ అని క్లారిటీ ఇచ్చారు. హీరోయిన్‌గా పూర్ణ నటించిన ‘అవును’ ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ను అందించింది. దానికి సీక్వెల్‌గా ‘అవును 2’ వచ్చిన సంగతి తెలిసిందే. రవిబాబు కథ అందిస్తూ నిర్మించిన తాజా చిత్రం ‘రష్‌’. ‘ఈటీవీ విన్‌’ ఓటీటీలో ఈ నెల 13న విడుదల కానుంది.

Updated Date - Jun 09 , 2024 | 04:21 PM