Rashmika Mandanna: జీవిత భాగస్వామి గురించి బయటపెట్టేసింది

ABN , Publish Date - Dec 19 , 2024 | 09:21 AM

శ్రీవల్లి పాత్రకు చక్కని గుర్తింపు రావడంతో రష్మిక క్లౌడ్‌నైన్‌లో ఉంది. తాజాగా ఆమె లవ్‌, రిలేషన్‌ (Love and relations) గురించి మాట్లాడారు. తనలాంటి నేషనల్‌ మనస్తత్వం ఉన్న భాగస్వామి కావాలని మనసులో మాట బయటపెట్టారు.

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా (Rashmika Mandanna) 'పుష్ప -2' (Pushpa-2) సక్సెస్‌ జోరులో ఉన్నారు. సినిమా హిట్‌ కావడంతోపాటు ఆమె పోషించిన శ్రీవల్లి పాత్రకు చక్కని గుర్తింపు రావడంతో రష్మిక క్లౌడ్‌నైన్‌లో ఉంది. తాజాగా ఆమె లవ్‌, రిలేషన్‌ (Love and relations) గురించి మాట్లాడారు. తనలాంటి నేషనల్‌ మనస్తత్వం ఉన్న భాగస్వామి కావాలని మనసులో మాట బయటపెట్టారు. లైఫ్‌ పార్టనర్‌ ఎలా ఉండాలో చెప్పింది.

‘నా భాగస్వామి నా జీవితంలోని ప్రతీ దశలోను తోడుగా ఉండాలి. ఎల్లవేళల నాకు భద్రతనివ్వాలి. జీవితంలోని కష్ట సమయంలో నాకు సపోర్ట్‌ చేయాలి. ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. ఇది మాత్రం పక్కాగా ఉండాలి. నాపై శ్రద్థ వహించాలి. మంచి మనసు ఉండాలి. ఒకరిపై ఒకరు బాధ్యతగా ఉండే జీవితమంతా కలిసిఉండొచ్చు’ అని అన్నారు.

Untitled-2.jpg


ప్రేమ గురించి చెబుతూ ‘‘జీవితంలో ప్రతిఒక్కరికీ తోడు కావాలి. నా దృష్టిలో ప్రేమలో ఉండడం అంటే భాగస్వామిని కలిగి ఉండడమే. తోడు లేకపోతే జీవితానికి ప్రయోజనం ఉండదు. మన ఒడుదొడుకుల్లో మనతో ఉండి సపోర్ట్‌ చేేసవారు ఉండాలి’ అని అన్నారు.

 
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు రష్మిక. తాజాగా ఆమె నటించిన ‘పుష్ప 2 ది రూల్‌’ ప్రేక్షకుల ముందుకువచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.  గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ టీజర్‌ తాజాగా విడుదలైంది. విజయ దేవరకొండ వాయిస్‌ అందించిన ఆ టీజర్‌ అందరినీ ఆకర్షిస్తోంది. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ప్రేమ కథతో లేడీ ఓరియంటెడ్‌ సినిమాగా రానుంది. 

Updated Date - Dec 19 , 2024 | 09:21 AM