Kubera Movie: జూలై 5న.. 'కుబేర' నుంచి రష్మిక ఫస్ట్ లుక్

ABN , Publish Date - Jul 02 , 2024 | 07:35 PM

ధ‌నుష్, నాగార్జున కాంబినేష‌న్‌లో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న చిత్రం కుబేర. తాజాగా క‌థానాయిక రష్మిక మందన్న అఫీషియల్ ఫస్ట్‌లుక్ విడుద‌ల గురించి ఓ అప్డేట్ ఇచ్చారు.

Kubera Movie: జూలై 5న.. 'కుబేర' నుంచి రష్మిక ఫస్ట్ లుక్
rashmika

ధ‌నుష్ (Dhanush) , నాగార్జున (Nagarjuna Akkineni) కాంబినేష‌న్‌లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వం వహిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ సోషల్ డ్రామా చిత్రం కుబేర(Kubera Movie). ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున అక్కినేని ఫస్ట్ లుక్‌లు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను తీసుకు వ‌చ్చాయి. ఈక్ర‌మంలో తాజాగా సినిమాలో క‌థానాయిక రష్మిక మందన్న (Rashmika Mandanna) అఫీషియల్ ఫస్ట్‌లుక్ విడుద‌ల గురించి ఓ అప్డేట్ ఇచ్చారు.


GRerg12XwAAHqze.jpeg

రష్మిక అఫీషియల్ లుక్ ని 5 జూలై 2024న లాంచ్ చేయ‌నున్న‌ట్లు మేకర్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు. తాజా అప్డేట్‌లో విడుదల చేసిన పోస్టర్‌లో రష్మిక (Rashmika Mandanna)క్యారెక్టర్ పింక్ కలర్ సూట్ ధరించి, ఆమె వెనుక సూట్‌కేస్‌ని లాగుతున్నట్లు ప్రెజెంట్ చేసింది. ఈ ‘కుబేర’ సినిమాలో జిమ్ సర్భ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోండ‌గా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్-ఇండియా లెవ‌ల్‌లో సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు.

Updated Date - Jul 02 , 2024 | 09:45 PM