Rashmika Mandanna: నన్ను మిస్‌ అవుతున్నారని తెలుసు.. అందుకే వాటితో అలరిస్తా!

ABN , Publish Date - Feb 25 , 2024 | 05:36 PM

నేషనల్‌ క్రష్‌ రష్మిక మంచి ఫామ్‌లో ఉంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ బ్యూటీ. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. ఇటీవల 'యానిమల్‌’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఆమె ఆ చిత్రానికి సంబంధించిన ఏ సక్సెస్‌ పార్టీలోనూ కనిపించలేదు

Rashmika Mandanna: నన్ను మిస్‌ అవుతున్నారని తెలుసు.. అందుకే వాటితో అలరిస్తా!


నేషనల్‌ క్రష్‌ రష్మిక (Rashmika mandanna) మంచి ఫామ్‌లో ఉంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ బ్యూటీ. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. ఇటీవల 'యానిమల్‌’ (Animal) చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఆమె ఆ చిత్రానికి సంబంధించిన ఏ సక్సెస్‌ పార్టీలోనూ కనిపించలేదు. సినిమా సక్సెస్‌ను ఆస్వాదించలేదు. ప్రస్తుతం దీనిపై చర్చ నడుస్తోంది. రష్మిక ఈ సినిమా ఇంటర్వ్యూలు, ప్రమోషన్  ఈవెంట్స్‌, సక్సెస్‌ పార్టీల్లో ఎందుకు పాల్గొనలేదు అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై రష్మిక సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. తాజాగా ఆమె నటిస్తున్న సినిమా సెట్స్‌లో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి ‘యానిమల్‌’ సక్సెస్‌ను తానెందుకు ఆస్వాదించలేకపోయిందో చెప్పుకొచ్చింది.

Rashmika Mandanna

‘‘యానిమల్‌ టీమ్‌ అందించిన భారీ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించి అతి విజయం అందించారు. మా టీమ్‌పై ప్రశంసలు కురిపించారు. ఆ విజయాన్ని ఎంజాయ్‌ చేయడానికి నేను కూడా కొంత సమయం కేటాయించాలనుకున్నా. కానీ, ‘యానిమల్‌’ విడుదలైన మరుసటి రోజే మరో సినిమా చిత్రీకరణతో బిజీ అయ్యా. నాకు పని పట్ల ఎంత నిబద్ధత ఉందో అర్థం చేసుకోండి(నవ్వుతూ). ఈ  సినిమా ప్రమోషన్స్ , విజయోత్సవ వేడుకల్లోనూ పాల్గొనలేకపోయా. ప్రతిష్ఠాత్మక చిత్రాల షూటింగ్స్‌ కోసం రాత్రుళ్లు కూడా ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. మీరు నన్ను మిస్‌ అవుతున్నారని నాకు తెలుసు. ఆ లోటును నేను నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌ భర్తీ చేస్తాయని భావిస్తున్నా. అవి మిమ్మల్ని విశేషంగా అలరిస్తాయి. మీరు వాటిని చూస్తూ ఎంజాయ్‌ చేసే క్షణాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అన్నింటికీ మించి మీ ప్రేమే నాకు సంతోషాన్ని ఇస్తుంది’’ అని ఇనస్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.

Rashmika Mandanna

రష్మిక షేర్‌ చేసిన ఫొటోల్లో ఆమె ఫేస్‌ పూర్తిగా కనిపించలేదు. ముఖానికి అడ్డుగా ఫోన్‌ పెట్టారు. తన కొత్త సినిమాలోని పాత్ర కోసం ఇలా రెడీ అయ్యాయని అందుకే ఫుల్‌ ఫేస్‌ చూపించలేకపోతున్నానని అన్నారామె. 'చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనిదే లుక్‌ బయటపెట్టడం కరెక్ట్‌ కాదు. షూటింగ్‌ చక్కగా జరుగుతోందని’ పేర్కొన్నారు. అయితే అది ఏ చిత్రానికి సంబంధించినదో చెప్పలేదు. ప్రస్తుతం ‘పుష్ప 2’, ‘రెయిన్‌ బో’, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’, ఛావా’ సినిమాలతో బిజీగా ఉంది రష్మిక. 

Updated Date - Feb 25 , 2024 | 05:42 PM