Gam Gam Ganesha: ఘాటు ప్రేమికుడి బాధ, గడగడలాడె గాథ ఇదిరా! గం..గం..గణేశా నుంచి ర్యాప్ సాంగ్ రిలీజ్

ABN , Publish Date - May 28 , 2024 | 07:44 PM

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గం..గం..గణేశా. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ర్యాప్ సాంగ్ రిలీజ్ చేశారు.

Gam Gam Ganesha: ఘాటు ప్రేమికుడి బాధ, గడగడలాడె గాథ ఇదిరా! గం..గం..గణేశా నుంచి ర్యాప్ సాంగ్ రిలీజ్
gam gam ganesha

ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గం..గం..గణేశా (Gam Gam Ganesha). ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ (Pragati Srivastava), నయన్ సారిక (Nayansarika) హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి (vamsi Karumanchi) నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి (Uday Bommisetty) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. "గం..గం..గణేశా" ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.

gam gam.jpeg


ఈ రోజు గం..గం..గణేశా (Gam Gam Ganesha) నుంచి ర్యాప్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ ర్యాప్ సాంగ్ ను కంపోజ్ చేసి ప్రణవ్ చాగంటితో కలిసి పాడారు మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj). ప్రణవ్ చాగంటి లిరిక్స్ అందించారు. ఒకడిది ఘాటు ప్రేమికుడి బాధ, గడగడలాడె గాథ ఇదిరా, ఒకడిది మాట దాటలేని బాట..గెలుపసలు ఎవడిదో..అంటూ కథలోని సోల్ ను రిఫ్లెక్ట్ చేస్తూ ఈ ర్యాప్ సాంగ్ సాగింది. పర్పెక్ట్ లిరిక్స్, బీట్ తో "గం..గం..గణేశా" ర్యాప్ సాంగ్ ఆకట్టుకుంటోంది.

Updated Date - May 28 , 2024 | 07:44 PM