Game Changer: చెన్నైకి.. రామ్‌చ‌ర‌ణ్‌ ‘గేమ్ చేంజ‌ర్‌’ షిప్ట్‌

ABN , Publish Date - Apr 29 , 2024 | 03:11 PM

గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజ‌ర్‌’. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ వ‌చ్చింది. మే మొద‌టి వారంలో చెన్నైలో కీల‌క షెడ్యూల్ ప్రారంభ‌మ‌వుతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

Game Changer: చెన్నైకి.. రామ్‌చ‌ర‌ణ్‌ ‘గేమ్ చేంజ‌ర్‌’ షిప్ట్‌
game changer

గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ (Global Star Ram Charan) హీరోగా సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ (Shankar) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజ‌ర్‌’ (Game Changer). శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ (SVC) బ్యాన‌ర్‌పై నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. RRR వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) చేస్తోన్న సినిమా కావ‌టంతో గేమ్ ఛేంజ‌ర్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇటీవ‌లే రామ్‌చ‌ర‌ణ్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా విడుద‌ల చేసిన జ‌ర‌గండి అనే పాట‌కు మంచి స్పంద‌న కూడా ల‌భించింది. అయితే ఈ సినిమా నుంచి మ‌రిన్ని అప్‌డేట్స్‌ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో అతృత‌తో ఎదురు చూస్తున్నారు.

Ramcharan.jpg

ద‌ర్శ‌కుడు శంక‌ర్ ప్ర‌స్తుతం కూతురి వివాహం, ఇండియ‌న్‌2 సినిమా ప‌నుల్లో బిజీగా ఉండ‌డంతో గేమ్‌ ఛేంజర్ చిత్రం ప‌రిస్థితి రెండ‌డుగులు వెన‌క్కి ఒక అడుగు ముందుకి అన్న‌ట్లుగా త‌యారైంది. తాజాగా ఈ సినిమా నుంచి ఎట్ట‌కేల‌కు కొత్త అప్డేట్ వ‌చ్చింది. మే మొద‌టి వారంలో చెన్నైలో కీల‌క షెడ్యూల్ ప్రారంభ‌మ‌వుతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ షెడ్యూల్‌లో న‌వీన్ నచంద్ర‌, సునీల్‌,కియారా అద్వానిల‌పై ప్రీ క్లైమాక్స్‌ ఘ‌ట్టాలు తెర‌కెక్కించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

gamechanger4.jpg


పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌తో వ‌స్తున్న ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) ద్విపాత్రాభిన‌యం చేస్తుండ‌గా అంజ‌లి, కియారా జంట‌గా న‌టిస్తున్నారు. ఈ మ‌ధ్యే హైద‌రాబాద్ శంషాబాద్ ఎయుర్‌పోర్ట్ ప‌రిస‌రాల్లో రామ్‌చ‌ర‌ణ్ పోషిస్తున్న క‌లెక్ట‌ర్ పాత్రకు సంబంధించి కొన్ని ముఖ్య స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌గా త‌మ త‌దుప‌రి షెడ్యూల్‌ను చైన్నెకి మార్చారు.

gamechanger3.jpg

మే1 నుంచి ఈ షెడ్యూల్ ప్రారంభ‌మ‌వుతుండ‌గా యాక్ష‌న్‌, కొన్ని కామెడీ సీన్స్ తెర‌కెక్కించ‌నున్న‌ట్లు సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో జూలై వ‌ర‌కు పూర్తి చేసి ఈ ఏడాది ద‌స‌రాకు గానీ దీపావ‌ళికి గాని రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్‌ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

Updated Date - Apr 29 , 2024 | 03:11 PM