scorecardresearch

Ram Charan: పెళ్లికి నన్ను ఎందుకు పిలవలేదు? ఆనంద్‌కు చరణ్‌ ప్రశ్న!

ABN , Publish Date - Mar 24 , 2024 | 03:49 PM

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌, మహీంద్రా గ్రూప్‌ యజమాని ఆనంద్‌ మహీంద్రా మధ్య జరిగిన సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘‘సుజీత్‌ పెళ్లికి నన్ను ఎందుకు ఆహ్వానించలేదు’’ అని చరణ్‌ ప్రశ్నించగా..  ‘‘గందరగోళంలో పడి మర్చిపోయా’’ అని మహీంద్రా రిప్లై ఇచ్చారు.

Ram Charan: పెళ్లికి నన్ను ఎందుకు పిలవలేదు? ఆనంద్‌కు చరణ్‌ ప్రశ్న!

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌(Ram charan), మహీంద్రా గ్రూప్‌ యజమాని ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) మధ్య జరిగిన సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘‘సుజీత్‌ పెళ్లికి నన్ను ఎందుకు ఆహ్వానించలేదు’’ అని చరణ్‌ ప్రశ్నించగా.. ‘‘గందరగోళంలో పడి మర్చిపోయా’’ అని మహీంద్రా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టులు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ ఈ సుజీత్‌ ఎవరు? అతని పెళ్లి గొడవ ఏంటో తెలుసుకోవాలనుందా?



2040 నాటికి కార్బన్‌ న్యూట్రల్‌గా మారడమే మహీంద్రా లక్ష్యమని చెబుతూ మహీంద్రా సంస్థ  ఓ వాణిజ్య ప్రకటన విడుదల చేసింది. కొన్నేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్‌లో మహీంద్రా ఫ్యాక్టరీ నిర్మించడమే కాకుండా లక్షలాది చెట్లు కూడా నాటారని.. రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ పిట్స్‌ కూడా నిర్మించారని ఆ వీడియోలో పేర్కొన్నారు. దాని వల్ల అండర్‌గ్రౌండ్‌ వాటర్‌ లెవల్‌ 400 అడుగులు పెరిగిందని.. నీటి ఎద్దడి కారణంగా బ్రహ్మచారిగా ఉన్న సుజీత్‌కు పెళ్లి ఫిక్స్‌ అయ్యిందని తెలిపారు. దీనిపై రామ్‌చరణ్‌ ప్రశంసలు వర్షం కురిపించారు. ఈ వీడియో షేర్‌ చేస్తూ.. ‘‘ఆనంద్‌ మహీంద్రా.. సుజీత్‌ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదు? జహీరాబాద్‌ దగ్గర్లోనే నేను ఉండేది. ఆ ప్రాంతంలో నా స్నేహితులను సరదాగా కలిసేవాడిని. ఏది ఏమైనా మీరు చేస్తుంది గొప్ప పని’’ అని రామ్‌చరణ్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.  దీనిపై మహీంద్రా స్పందించారు.



‘‘యెస్‌.. రామ్‌చరణ్‌.. నేను అంగీకరిస్తున్నాను. కాస్త గందర గోళానికి గురయ్యా. నీకు ఆహ్వానం పంపించడం మర్చిపోయా. మీ శిక్షణ ఆధారంగా నా డ్యాన్స్‌ను మెరుగుపరుచుకునే పనిలో ఉన్నా. మా ప్రకటన పట్ల స్పందించి ప్రశంసలు కురిపించినందుకు ధన్యవాదాలు. ఇదెంతో  సానుకూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నా. నేను మరోసారి మిస్‌ కావాలని అనుకోవడం లేదు. అందుకే ఇప్పుడే చెబుతున్నా. హ్యాపీ బర్త్‌డే ఇన్‌ అడ్వాన్స్‌’’ అని రిప్లై ఇచ్చారు. ‘‘త్వరలోనే మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నా. మీ అభినందనలకు ధన్యవాదాలు’’ అని చరణ్‌ అన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇటీవల బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఆర్.సి16 చిత్రం ప్రారంభమైంది. 

Updated Date - Mar 24 , 2024 | 03:50 PM