RC16 Movie: గేమ్‌ ఛేంజర్‌ పూర్తయ్యాకే..

ABN , Publish Date - May 17 , 2024 | 02:57 PM

గ్లోబల్‌స్టార్‌ రాంచరణ్‌ హీరోగా, అగ్ర దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'గేమ్‌ ఛేంజర్‌’ షూటింగ్‌ మొదలై చాలా కాలం అయినా ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు.

RC16 Movie:  గేమ్‌ ఛేంజర్‌ పూర్తయ్యాకే..

గ్లోబల్‌స్టార్‌ రాంచరణ్‌ (Ram charan) హీరోగా, అగ్ర దర్శకుడు శంకర్‌ (Shankar) దర్శకత్వంలో రూపొందుతున్న 'గేమ్‌ ఛేంజర్‌’ (Game changer) షూటింగ్‌ మొదలై చాలా కాలం అయినా ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ఇటీవల తాజా షెడ్యూల్‌ మొదలుపెట్టారు. అక్టోబర్‌లో విడుదల చేయాలన్న తాపత్రయంతో శరవేగంగా చిత్రీకరణ చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత రామ్‌చరణ్‌ 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 'ఆర్‌సీ 16' వర్కింగ్‌ టైటిల్‌తో ఓ చిత్రం చేయబోతున్నారు. ఇటీవల గ్రాండ్‌గా ఈ చిత్రం పూజా రెగ్యులర్‌ షూటింగ్‌ ఇంకా మొదలు కాలేదు. దర్శకుడు బుచ్చిబాబు అయితే షూటింగ్‌ ఎప్పుడు మొదలుపెడదామా అని ఆతురతగా ఎదురుచూస్తున్నారు.

అయితే 'గేమ్‌ చేంజర్‌' షూటింగ్‌ పూర్తి కాకుండా రాంచరణ్‌ ఈ సినిమా షూటింగ్‌ పాల్గొనకూడదని ఫిక్స్‌ అయ్యారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. 'ఆర్‌సీ 16' (Rc16) షూటింగ్‌ను జూనలో ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇందులో కథానాయికగా జాన్వీ కపూర్‌ ఎంపికయ్యారు. ఆస్కార్‌ విన్నర్‌ ఏఆర్‌ రెహమాన్‌  సంగీతం అందిస్తున్నారు.  గేమ్‌ ఛేంజర్‌ చిత్రాన్ని అక్టోబర్‌ 10 న విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.

Updated Date - May 17 , 2024 | 04:11 PM