scorecardresearch

Ram pothineni: రామ్‌ ఏంటిది... ఇంత సాహసమా?

ABN , Publish Date - Aug 11 , 2024 | 09:57 PM

ఉస్తాద్‌ రామ్‌ సోషల్‌ మీడియాలో అరుదుగా కనిపిస్తుంటారు. ఎప్పుడైనా తనకు సంబందించిన విషయాలపై సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేస్తుంటారు. తాజాగా అలాంటి ఓ పోస్ట్‌ చేసి నెటిజన్లను, అభిమానులను అలరించారు.

Ram pothineni: రామ్‌ ఏంటిది... ఇంత సాహసమా?

ఉస్తాద్‌ రామ్‌ (Ram pothineni) సోషల్‌ మీడియాలో అరుదుగా కనిపిస్తుంటారు. ఎప్పుడైనా తనకు సంబందించిన విషయాలపై సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి సర్‌ప్రైజ్‌ (Ram workouts)చేస్తుంటారు. తాజాగా అలాంటి ఓ పోస్ట్‌ చేసి నెటిజన్లను, అభిమానులను అలరించారు. ఆయన వర్కవుట్స్‌కి సంబంధించిన ఫొటోలను షేర్‌ చేశారు. అవి నెట్టింట వైరల్‌గా మారాయి. 'డబుల్‌ ఇస్మార్ట్‌' కోసం స్టీమ్ అండ్‌ జిమ్‌ (Steam and gym)సెషన్‌ అయిపోయిందని, ఇక జిమ్‌ ట్రైనర్‌ని ఇబ్బంది పెట్టడమే ఉందంటూ క్రేజీ క్యాప్షన్‌ ఇచ్చాడు. అంతే కాదు పోస్ట్‌ జిమ్‌ తర్వాత తన డైట్‌ మీల్‌ని ఏంటో కూడా చూపించాడు.

Ram.jpgఇప్పటి దాకా లవర్‌బాయ్‌లా కనిపించిన రామ్‌ ఇస్మార్ట్‌ శంకర్‌లో మాస్‌లో లుక్‌లో కనిపించాడు. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న 'డబుల్‌ ఇస్మార్ట్‌' కోసం బీస్ట్‌ మోడ్‌లోకి మారాడు. ఈ సినిమా కోసం చేసిన వర్కవుట్‌ ఫొటోలను ఆయన విడుదల చేశారు. ఈ సినిమా కోసం ఏకంగా 18 కిలోలు తగ్గారట. ఈ వర్కవుట్‌ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆయన హీరోగా, డాషింగ్‌ అండ్‌ డేరింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూరీ కనెక్ట్స్‌ బ్యానరల్లో చార్మి, పూరీ జగన్నాథ్‌ సంయుక్తంగా నిర్మించారు.  

ra2.jpg
తాజాగా ఓ ఇంటర్వ్యూలు రామ్‌ మాట్లాడుతూ ‘’డబుల్‌ ఇస్మార్ట్‌’ కోసం పూరీ జగన్నాథ్‌ చెప్పిన క్లైమాక్స్‌ కిక్‌ ఇచ్చింది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లానే ఇందులోనూ షర్ట్‌ లేకుండా క్లైమాక్స్‌ చేయాలనుకున్నాం. ఆ పార్ట్‌ అంతా నవంబరులోనే షూట్‌ చేయాలి. 'స్కంద' రిలీజైన తర్వాత నాకు 2 నెలలు మాత్రమే సమయం ఉంది. దాంతో వెంటనే బాలిలో ఓ ప్రాంతానికి వెళ్లి అక్కడే నెల రోజులు ఉండి ఫుల్లుగా వర్కౌట్‌ చేసి బరువు తగ్గాను. ఇలా తక్కువ టైంలో బరువు తగ్గడం ఆరోగ్యానికి ప్రమాదం. నేను చేసినట్లు ఎవరూ ప్రయత్నించొద్దు’ అని రామ్‌ చెప్పుకొచ్చాడు.

ram-food.jpg

Updated Date - Aug 11 , 2024 | 09:58 PM