Ram pothineni: అప్పటికి ఆ హడావిడి అంతా అయిపోతుంది!

ABN , Publish Date - Mar 23 , 2024 | 03:23 PM

రామ్‌ పోతినేని (Ram pothineni) హీరోగా  పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మాస్‌ ఆడియన్స్ ని  ఎంతగా అలరించిందో తెలిసిందే! రామ్‌ కెరీర్‌కి పెద్ద హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double ismart) సిద్థమైన సంగతి తెలిసిందే.

Ram pothineni: అప్పటికి ఆ హడావిడి అంతా అయిపోతుంది!

రామ్‌ పోతినేని (Ram pothineni) హీరోగా  పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మాస్‌ ఆడియన్స్ ని  ఎంతగా అలరించిందో తెలిసిందే! రామ్‌ కెరీర్‌కి పెద్ద హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double ismart) సిద్థమైన సంగతి తెలిసిందే. దీని విడుదల తేదీపై రామ్‌ కామెంట్‌ చేశారు. ఈ చిత్రాన్ని ప్రకటించినప్పుడే మార్చి 8న విడుదల చేస్తామని వెల్లడించారు. షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ ఆలస్యం కావడంతో వాయిదా వేసినట్లు చెప్పారు. తాజాగా రామ్‌ ఈ సినిమా విడుదలపై స్పందించారు. జూన్‌లో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. అప్పటికి ఎన్నికల హడావిడి అంతా అయిపోతుందని.. అందుకే వాయిదా వేసినట్లు చెప్పారు. ‘ఈ సారి వినోదం, యాక్షన్‌ అన్నీ డబుల్‌. మీ అందరికి డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వడానికి మేం తిరిగి వచ్చేశాం’ అని రామ్‌ అన్నారు.

Untitled-2.jpg
2019లో విడుదలైన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సూపర్‌ హిట్‌ కావడంతో దీన్ని హిందీతో సహా పలు భాషల్లో రీమేక్‌ చేయగా అక్కడ కూడా విజయం సాధించింది. అందుకే ఇప్పుడు డబుల్‌ ఇస్మార్ట్‌ను పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. చార్మి, పూరీ జగన్నాథ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Mar 23 , 2024 | 03:23 PM