మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ram Charan: టిల్లు స్క్వేర్‌ చూసి రామ్‌చరణ్‌ స్పందన!

ABN, Publish Date - Apr 07 , 2024 | 04:49 PM

"టిల్లు స్వ్కేర్‌’ (Tillu Square) చిత్రాన్ని వీక్షించిన గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ 9Ram charan) సిద్ధూ జొన్నలగడ్డపై (Siddu Jonnalagadda) ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ చిత్రాన్ని రామ్‌చరణ్‌, రానా వీక్షించారు.

Ram charan, Siddu Jonnalagadda


"టిల్లు స్వ్కేర్‌’ (Tillu Square) చిత్రాన్ని వీక్షించిన గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ 9Ram charan) సిద్ధూ జొన్నలగడ్డపై (Siddu Jonnalagadda) ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ చిత్రాన్ని రామ్‌చరణ్‌, రానా వీక్షించారు. చిత్రబృందాన్ని ముఖ్యంగా సిద్థూ జొన్నలగడ్డను మెచ్చుకుంటూ   ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘డియర్‌ సిద్థూ.. ‘డీజే టిల్లు’తో నువ్వు అద్భుతమైన విజయాన్ని అందుకున్నందుకు నేను గర్వపడుతున్నా. హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్‌, దర్శకుడు మల్లిక్‌ రామ్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తోపాటు చిత్రబృందం మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు’ అని రామ్‌చరణ్‌ అన్నారు. అలాగే రానా కూడా ఈ సినిమాపై స్పందించారు. సినిమా బాగా నచ్చేసిందని అన్నారు. సినిమా సినిమాకు సిద్ధూ టాలెంట్‌తో ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని అందిస్తున్నారు. సిద్థు అందుకున్న ఈ విజయం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది అన్నారు రానా.

రెండేళ్ల క్రితం వచ్చిన ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా ‘టిల్లు స్వ్కేర్‌’ తెరకెక్కింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ‘డీజే టిల్లు’కు మించి ఈ చిత్రం ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. విడుదలైన వారంలో రూ.96.6 కోట్ల గ్రాస్‌ వసూళ్లు రాబట్టిందని నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొంది. సినిమా సక్సెస్‌లో భాగంగా చిత్ర బృందం ఈ నెల 8న విజయోత్సవ వేడుక జరగనుంది. ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

Updated Date - Apr 07 , 2024 | 04:51 PM