Ram Charan: రెండు వార్తలు వైరల్‌.. ట్రెండింగ్‌లో రామ్‌చరణ్‌

ABN , Publish Date - Mar 15 , 2024 | 03:57 PM

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ బుచ్చిబాబు కాంబినేషన్ లో 'ఆర్‌సీ 16’ వర్కింగ్‌ టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే! దీనిపై అధికారిక ప్రకటన విడుదలై చాలా కాలమైంది. అలాగే చిత్రానికి సంబంధించి ఆఫీస్‌ కూడా ఓపెన్ చేశారు.

Ram Charan: రెండు వార్తలు వైరల్‌.. ట్రెండింగ్‌లో రామ్‌చరణ్‌

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram charan), బుచ్చిబాబు (Buchi babu) కాంబినేషన్ లో 'ఆర్‌సీ 16’ (RC 16) వర్కింగ్‌ టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే! దీనిపై అధికారిక ప్రకటన విడుదలై చాలా కాలమైంది. అలాగే చిత్రానికి సంబంధించి ఆఫీస్‌ కూడా ఓపెన్ చేశారు.  సినిమా అప్‌డేట్‌ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉందీ టీమ్‌. శుక్రవారం ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త ట్రెండ్‌ అవుతోంది. ఈ ప్రాజెక్ట్‌ పూర్తి వివరాలు ఈ నెల 20న ప్రకటించనున్నారని, అదే రోజు సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని ఫ్యాన్  పేజీలో ఓ  వార్త వైరల్‌ అవుతోంది. ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌కు ‘పెద్ది’ (PEDDI)అనే పేరును ఖరారు చేసినట్లు కూడా తెలుస్తోంది.

గతంలో ఈ టైటిల్‌ను ఎన్టీఆర్‌ సినిమా కోసం బుచ్చిబాబు రిజిస్టర్‌ చేశారని.. ఇప్పుడు అదే పేరును రామ్‌ చరణ్‌ సినిమాకు పెడుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అంతే కాదు ఫస్ట్‌ ఈ కథను లైనగా ఎన్టీఆర్‌కు చెప్పారని, స్టోరీ డెవలప్‌మెంట్‌ తర్వాత ఆ పాత్రకు ఎన్టీఆర్‌ కంటే రామ్‌చరణ్‌కు యాప్ట్‌గా ఉంటందని భావించడంతో ఈ ప్రాజెక్ట్‌ చరణ్‌ వైపు వచ్చినట్ల చెబుతున్నారు. ఈ చిత్రంలో చరణ్‌ సరసన జాన్వీ కపూర్‌ నటించబోతోంది. విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడిగా నటిస్తారని సమాచారం.

Game.jpg
వైజాగ్‌లో గేమ్‌ ఛేంజర్‌ (Game Changer) టీమ్‌
ప్రస్తుతం రామ్‌ చరణ్‌ అండ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ టీమ్‌ వైజాగ్‌లో ఉన్నారు. శంకర్‌ (Shankar)దర్శకత్వంలో పొలిటికల్‌, యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ వైజాగ్‌లో ప్రారంభించనున్నారు. దీని కోసం చిత్ర బృందంలో రామ్‌చరణ్‌, శంకర్‌, సముద్రఖని, శ్రీకాంత్, శుభలేఖ సుధాకర్‌, అంజలి, నవీన్ చంద్ర తదితరులు శుక్రవారం వైజాగ్‌లో దిగారు. ఎయిర్‌పోర్ట్‌లో రామ్‌చరణ్‌ అభిమానులు వేలమంది సినిమా టీమ్‌కు పూల వర్షంతో స్వాగతం పలికారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కియారా అద్వానీ ఈ చిత్రంలో కథానాయిక. 

Updated Date - Mar 15 , 2024 | 04:00 PM