Upasana New Name: పుట్టినరోజున రామ్‌చరణ్‌ అలా పిలిచారు!

ABN, Publish Date - Jul 22 , 2024 | 03:42 PM

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) తన భార్య ఉపాసనకి (Upasana) కొత్త పేరు పెట్టారు. తాజాగా  ఆమె పుట్టినరోజు జరుపుకొంది. ఈ సందర్భంగా ఆమె శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

Upasana New Name: పుట్టినరోజున  రామ్‌చరణ్‌ అలా పిలిచారు!

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) తన భార్య ఉపాసనకి (Upasana) కొత్త పేరు పెట్టారు. తాజాగా  ఆమె పుట్టినరోజు జరుపుకొంది. ఈ సందర్భంగా ఆమె శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బర్త్‌ డే వేడుకల్ని చరణ్‌తో కలిసి సెలబ్రేట్‌ చేసుకుంది ఉపాసన. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన చెర్రీ.. కొత్త పేరు ఏంటనేది రివీల్‌ చేశాడు. హ్యాపీ బర్త్‌డే ‘కారా మమ్మీ’ (kaara mummy) అని రాసుకొచ్చాడు. ఎప్పటిలా ఉపాసన అని పిలవకుండా క్లీంకార (Klinkara)తల్లి అని ఫన్నీగా సంభోదించాడు. దీనికి రిప్లై ఇచ్చిన ఉపాసన.. ‘థ్యాంక్యూ మిస్టర్‌ సీ. నీ సెల్ఫీ స్కిల్స్‌ మాత్రం సూపర్‌’ అని రాసుకొచ్చింది. ఈ సంభాషణ నెట్టింట వైరల్‌ అవుతోంది.

ప్రస్తుతం రామ్‌చరణ్‌, శంకర్‌ దర్శకత్వంలో 'గేమ్‌ ఛేంజర్‌’ (Game changer) చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్‌ పండుగ సందర్భంగా విడుదల చేస్తామని నిర్మాత దిల్‌ రాజు (Dil raju)ఇటీవల ఓ వేదికపై వెల్లడించారు. తదుపరి రామ్‌ చరణ్‌ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ కథానాయిక. ప్రస్తుతం చరణ్‌ ఈ సినిమా మేకోవర్‌ పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఆ క్యారెక్టర్‌ కోసం ఆయన గడ్డం పెంచుతున్నారని తెలిసింది. ఆగస్ట్‌లో చిత్రీకరణ మొదలవుతుందని టాక్‌. 

Updated Date - Jul 22 , 2024 | 08:19 PM