Game Changer: మనిషి ఎన్ని రకాలుగా ఉండగలడో అన్ని రకాలుగా..!

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:42 PM

స్టార్స్‌ బర్త్‌డే వేడుకలు అంటే అభిమానుల కోలాహలం మామూలుగా ఉండదు. అదే రోజు అభిమానులకు తమ చిత్రాల అప్‌డేట్‌లతో ట్రీట్‌ ఇస్తుంటారు స్టార్‌ హీరోలు. ప్రచార చిత్రాలు, ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్‌, సింగిల్స్‌ పేరుతో రకరకాల అప్‌డేట్స్‌ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతుంటారు.

Game Changer: మనిషి ఎన్ని రకాలుగా ఉండగలడో అన్ని రకాలుగా..!

స్టార్స్‌ బర్త్‌డే (RC Birthday) వేడుకలు అంటే అభిమానుల కోలాహలం మామూలుగా ఉండదు. అదే రోజు అభిమానులకు తమ చిత్రాల అప్‌డేట్‌లతో ట్రీట్‌ ఇస్తుంటారు స్టార్‌ హీరోలు. ప్రచార చిత్రాలు, ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్‌, సింగిల్స్‌ పేరుతో రకరకాల అప్‌డేట్స్‌ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతుంటారు. మార్చి నెలలో రామ్‌చరణ్‌ పుట్టినరోజు వస్తోంది. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న చిత్రాలకు సంబంధించి హంగామా షురూ కానుంది. మార్చి 27న రామ్‌చరణ్‌ (Ram charan) పుట్టినరోజు సందర్భంగా ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) నుంచి తాజా అప్‌డేట్‌ రానుందని తెలుస్తోంది. శంకర్‌ (Shankar) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. సినిమాను ఈ ఏడాదిలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దసరా లేదా దీపావళి పండుగల సమయంలో విడుదల చేసే అవకాశం ఉందని నెట్టింట వార్తలు వైరల్‌ అవుతున్నాయి. అది ఎప్పుడనే విషయంపై చరణ్‌ పుట్టినరోజున స్పష్టత వచ్చే అవకాశం ఉంది. (Ram Charan Birthday Special)


ఇప్పటికే రామ్‌చరణ్‌ నటిస్తున్న గేమ్‌ ఛేంజర్‌’ చిత్రానికి సంబంధించి పలు వార్తలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 'గేమ్‌ ఛేంజర్‌’ సినిమా గేమ్‌ ఛేంజింగ్‌ మూమెంట్‌ కానుందని, 'ఇందులో రామ్‌చరణ్‌ మాస్‌, క్లాస్‌, రగ్డ్‌, అఫీషియల్‌ ఇలా ఒక మనిషి జీవితంలో ఎన్ని రకాలుగా ఉండగలడో అన్ని రకాలుగా ఈ చిత్రంలో కనిపిస్తాడు’ అని రచయిత సాయి మాధవ్‌ బుర్రా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వీడియో క్లిప్‌ ట్రెండ్‌ అవుతోంది. మరో నటి కారుణ్య గేమ్‌ ఛేంజర్‌ నెక్స్ట్‌ లెవల్‌లో ఉంటుందని తెలిపారు. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. 

Updated Date - Feb 27 , 2024 | 12:45 PM