65 ఏండ్లు దాటిన వృద్ధులు ఇంటి నుంచి పారిపోతే.. ఆస‌క్తిక‌రంగా ల‌వ్ ఎట్ 65 టీజ‌ర్‌

ABN , Publish Date - Feb 16 , 2024 | 07:43 PM

రాజేంద్ర ప్రసాద్ , జయప్రద ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం లవ్ ఎట్ 65. విఎన్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ షినిమా థియేట్రికల్ ట్రైలర్ ని ఈ రోజు (శుక్ర‌వారం) విడుదల చేశారు.

65 ఏండ్లు దాటిన వృద్ధులు ఇంటి నుంచి పారిపోతే.. ఆస‌క్తిక‌రంగా ల‌వ్ ఎట్ 65 టీజ‌ర్‌
65

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) ఒకే సమయంలో చాలా సినిమాలను నిర్మిస్తోంది, యూనిక్ కంటెంట్‌తో చిన్న నుంచి మీడియం రేంజ్ సినిమాలను కూడా రూపొందిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad), జయప్రద (Jaya Prada) ప్రధాన పాత్రల్లో నటించిన లవ్ @ 65 (Love At 65 ) అటువంటి సరికొత్త కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ. బ్లాక్‌బస్టర్‌లను అందించిన దర్శకుడు విఎన్ ఆదిత్య (VNAditya) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈరోజు, మేకర్స్ ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ ని విడుదల చేశారు.

GGW589ZaEAAGw38.jpg

ట్రైలర్ చూస్తే.. ఆయనకి డెబ్బై సంవ‌త్స‌రాలు నిండాయి. ఆవిడకి అరవై ఐదు దాక వుంటాయి. ఈ ఇద్దరూ కాలనీ నుంచి పారిపోయిన ఆసక్తికరమైన ఓ సన్నివేశంతో ప్రారంభమవుతుంది. ఈ క్ర‌మంలో వారు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని, జీవితాంతం ఒకరితో ఒకరు గడపాలని నిర్ణయించుకుంటారు. ఈ క్ర‌మంలో వారి కుటుంబాల మ‌ధ్య జ‌రిగే స‌న్నివేశాల‌తో హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో పాటు, మనసును కదిలించే భావోద్వేగాలు కూడా ఉన్నాయని లవ్ @ 65 (Love At 65 ) ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది.


ఈ చిత్రంలో కార్తీక్ రాజు, స్పందన, క్రిష్, నిహంత్రీ రెడ్డి, నారాయణరావు, ప్రదీప్, సాయి శ్రీనివాస్, ప్రీతి నిగమ్ ముఖ్య పాత్రలు పోషించగా, అజయ్, సునీల్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. సుధీర్ చింటూ కథను అందించగా, లక్ష్మీ భూపాల డైలాగ్స్ అందించారు. శ్యామ్ తుమ్మలపల్లి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. జునైద్ సిద్ధిఖీ ఎడిటర్. సినిమా త్వరలో విడుదలకు సిద్ధమమౌతుంది.

Updated Date - Feb 16 , 2024 | 07:43 PM