Rajamouli-Rama: అందమైన ప్రేమరాణి చేయి తగిలితే.. వీడియో వైరల్‌

ABN , Publish Date - Apr 01 , 2024 | 03:18 PM

సినిమా అవుట్‌పుట్‌ కోసం ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) ఎంతగా కష్టపడతారో తెలిసిందే. బెస్ట్‌ ప్రాడక్ట్‌ కోసం అహర్నిశలు శ్రమిస్తుంటారు. అలాగే ఖాళీ టైమ్‌లో కుటుంబ సభ్యులతో సరదాగా టూర్లు, షికార్లు అంటూ సరదాగా గడుపుతుంటారు. తాజాగా ఓ వేదికపై డాన్స్ తో అలరించారు.

Rajamouli-Rama: అందమైన ప్రేమరాణి చేయి తగిలితే.. వీడియో వైరల్‌

సినిమా అవుట్‌పుట్‌ కోసం ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) ఎంతగా కష్టపడతారో తెలిసిందే. బెస్ట్‌ ప్రాడక్ట్‌ కోసం అహర్నిశలు శ్రమిస్తుంటారు. అలాగే ఖాళీ టైమ్‌లో కుటుంబ సభ్యులతో సరదాగా టూర్లు, షికార్లు అంటూ సరదాగా గడుపుతుంటారు. తాజాగా ఓ వేదికపై డాన్స్ తో అలరించారు. ప్రభుదేవా (Prabhudeva) పాటకు స్టెప్పులేశారు. శ్రేయోభిలాషుల ఇంట్లో జరుగుతున్న పెళ్లి సంగీత్లో  పాల్గొన్న ఆయన తన సతీమణి రమతో (Rama Rajamouli) కలిసి ‘అందమైన 'ప్రేమరాణి చెయ్యి తగిలితే’ పాటకు వేదికపై డ్యాన్స్‌ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ‘వావ్‌.. సూపర్‌గా డ్యాన్స్‌ చేశారు. జక్కన్నలో ఈ యాంగిల్‌ కూడా ఉందా?’ అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

Sravs.jpg
'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR)తర్వాత కొంత గ్యాప్‌ ఇచ్చిన ఆయన ప్రస్తుతం మహేష్‌బాబు సినిమా కోసం కసరత్తులు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌ మీదకెళ్లనుంది.  యాక్షన్‌ అడ్వెంచర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ భాగం కానున్నారు. ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Updated Date - Apr 01 , 2024 | 03:23 PM