RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం జపాన్‍కు జక్కన్న

ABN , Publish Date - Mar 14 , 2024 | 06:27 PM

టాలీవుడ్‌ దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వంలో రామ్‌ చరణ్‌9Ram charan), ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలు పోషించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR) చిత్రం  ప్రపంచవ్యాప్తంగా ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే!

RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం జపాన్‍కు  జక్కన్న


టాలీవుడ్‌ దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వంలో రామ్‌ చరణ్‌9Ram charan), ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలు పోషించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR) చిత్రం  ప్రపంచవ్యాప్తంగా ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే! అంతే కాదు ఆస్కార్‌ అవార్డును కూడా సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్‌ను అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. ఈ చిత్రం విడుదలై ఏడాదిన్నర కావొస్తున్నా ఇంకా క్రేజ్‌ తగ్గలేదంటూ చిత్ర బృందం ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR in Japan) అధికారిక ట్విట్టర్‌లో ఖాతాలో ఓ పోస్ట్‌ చేసింది. "సినిమాకు ఇప్పటికీ క్రేజ్‌ తగ్గలేదు. ఇప్పటికీ హౌస్‌ఫుల్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. మార్చి 18న ఈ సినిమాను వీక్షించేందుకు రాజమౌళి జపాన్‌ వెళ్లనున్నారు. ఈ విషయం తెలియడంతో అక్కడి ప్రేక్షకులు ఆయనతో కలిసి చిత్రాన్ని చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. దీంతో వేలాదిమంది టికెట్స్‌ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. బుధవారం రాత్రి టికెట్స్‌ బుకింగ్‌ ఓపెన్  చేయగానే ఒక్క నిమిషంలోనే హౌస్‌ఫుల్‌ అయింది. దీనిపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్‌ చేస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌ క్రేజ్‌ ఇది’ అంటూ ‘రాజమౌళి తెలుగు సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు అంటూ ప్రశంసిస్తున్నారు.

Updated Date - Mar 14 , 2024 | 06:27 PM