PV Sindhu: విజయ్‌ దేవరకొండ గురించి చెబితే కాంట్రవర్సీ అవుతుంది!

ABN , Publish Date - Feb 14 , 2024 | 05:11 PM

పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని, అయితే ఇప్పటి వరకూ ఆయన్ను కలవలేదని కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదని బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు అన్నారు. తాజాగా ఆమె ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

 PV Sindhu:  విజయ్‌ దేవరకొండ గురించి చెబితే కాంట్రవర్సీ అవుతుంది!

పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) అంటే తనకు ఎంతో ఇష్టమని, అయితే ఇప్పటి వరకూ ఆయన్ను కలవలేదని కనీసం ఫోన్లో  కూడా మాట్లాడలేదని బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు (PV Sindhu) అన్నారు. తాజాగా ఆమె ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. స్పోర్ట్స్‌ జర్నీతోపాటు టాలీవుడ్‌ కథానాయకుల గురించి చెప్పుకొచ్చారు. సంబంధిత వీడియో క్లిప్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ‘ప్రభాస్‌ని ఎప్పుడైనా కలిశారా?’ అన్న ప్రశ్నకు పైవిధంగా సమాధానమిచ్చారు సింధు. ప్రభాస్‌ నటనంటే ఇష్టమని, బాగా యాక్ట్‌ చేస్తారని, ఆయన సినిమాలు చూస్తుంటానని చెప్పారు. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ నటన కూడా ఇష్టమేనన్నారు.

Sindhu.jpg

విజయ్‌ దేవరకొండ నటించిన కొన్ని చిత్రాలు నచ్చాయన్న ఆమె నచ్చని చిత్రాలేంటని ప్రశ్నించగా చెబితే కాంట్రవర్సీ అవుతుందంటూ నవ్వారు. క్రీడాకారుల్లాగే సినిమా ఆర్టిస్ట్‌లకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుదని ఆమె చెప్పారు. తాను వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన సందర్భంగా 2021లో చిరంజీవి ఇంటికి ఆహ్వానించి, సత్కరించడాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. పీవీ సింధు సినిమాలు ఎక్కువగా చూస్తారు. అంతే కాదు వాటి గురించి తన అభిప్రాయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్‌ మూవీ ‘ఫైటర్‌’పై పోస్ట్‌ పెట్టారు. దానిపై, హీరోయిన్‌ దీపికా పదుకొణె స్పందిస్తూ ‘లవ్‌ యూ’ అని కామెంట్‌ పెట్టారు.

Updated Date - Feb 14 , 2024 | 05:11 PM