Pushpa 2: సస్పెన్స్  దాని కోసమేనా?

ABN , Publish Date - May 29 , 2024 | 09:27 AM

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్(Allu arjun), సుకుమార్‌ (Sukumar) కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘పుష్ప 2’ (Pushpa2). గతంలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయిన ‘పుష్ప’ సినిమాకు సీక్వెల్‌ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

 Pushpa 2: సస్పెన్స్  దాని కోసమేనా?

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్(Allu arjun), సుకుమార్‌ (Sukumar) కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘పుష్ప 2’ (Pushpa2). గతంలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయిన ‘పుష్ప’ సినిమాకు సీక్వెల్‌ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.  మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్‌ చేసిన పోస్టర్స్‌, టీజర్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా  నుంచి ఫస్ట్‌ సింగల్‌ రిలీజ్‌ చేశారు. పుష్ప.. పుష్ప.. అంటూ సాగే ఈ పాట ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.  ఏకంగా 100 మిలియన్‌ వ్యూస్‌ సాధించింది. ఇదిలా ఉంటే బుధవారం 11.07 గంటలకు ఈ సినిమా నుంచి సెకండ్‌ సింగల్‌ రిలీజ్‌ కానుంది. స్టార్‌ సింగర్‌ శ్రేయ ఘోషల్‌ పాడిన ఈ కపుల్‌ సాంగ్‌ (Couple song) ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది అని మేకర్స్‌ చెబుతున్నారు. 


ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా క్లైమాక్స్‌లో మేకర్స్‌ ఊహించని ట్విస్ట్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. పుష్ప 3 కి సంబంధించి సమాచారం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్‌ కూడా ప్లాన చేస్తున్నారని టాక్‌ నడుస్తోంది. యానిమల్‌ బ్యూటీ తృప్తి డిమ్రి ఈ సాంగ్‌లో ఆడిపాడనున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే సుకుమార్‌ ఈ పాటను కూడా షూట్‌ చేసే అవకాశం ఉంది. అయితే పుష్ప-3 కూడా ఉంటుందని చాలాకాలంగా టాక్‌ నడుస్తోంది. తాజాగా సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు దాని గురించే అని టాక్‌. అల్లు అర్జున సరసన రష్మిక మందన్నా నటిస్తోన్న ఈ చిత్రంలో ఫవాద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. 

Updated Date - May 29 , 2024 | 09:37 AM