Pushpa 2: షూటింగ్‌ ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారంటే!

ABN , Publish Date - Mar 19 , 2024 | 05:54 PM

ప్రస్తుతం Pushpa చిత్రానికి కొనసాగింపుగా పుష్ప-2 తెరకెక్కుతుంది. మొదటి భాగాన్ని మించేలా ఈ చిత్రం ఉండేలా దర్శకుకుడు సుకుమార్‌ కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. (Allu arjun)

Pushpa 2: షూటింగ్‌ ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారంటే!

పుష్ప (pushpa-2)సినిమా పాన్  ఇండియా స్థాయిలో ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే! ఈ సినిమా సక్సెస్‌తో అల్లు అర్జున్  ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌ అయ్యారు. అంతే కాదు ఈ చిత్రంలో నటనకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకుని ఇప్పటిదాకా తెలుగు సినిమా చరిత్రలో ఎవరూ సాధించని ఘనతను ఆయన దక్కించుకున్నారు. ప్రస్తుతం Pushpa చిత్రానికి కొనసాగింపుగా పుష్ప-2 తెరకెక్కుతుంది. మొదటి భాగాన్ని మించేలా ఈ చిత్రం ఉండేలా దర్శకుకుడు సుకుమార్‌ కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. (Allu arjun)

Pushpa-2.jpg

పుష్ప -2 ఆసక్తికర విషయాలు 


కొద్ది రోజుల క్రితం రావు రమేష్‌ సీఎం అయ్యే సన్నివేశాలను చిత్రీకరించారు. పుష్పలో ఎంపీగా కనిపించిన ఆయన పుష్ప-2లో  ముఖ్యమంత్రిగా కనిపిస్తారు. పార్టీ ఆఫీస్‌, వేలమంది కార్యకర్తలు, భారీ కటౌట్లతో ర్యాలీగా వెళ్తున్న సన్నివేశాలు చిత్రీకరించారు.

ఇటీవల పలు సన్నివేశాల చిత్రీకరణ కోసం పుష్ప బృందం వైజాగ్‌ వెళ్లిన సంగతి తెలిసిందే! దాంతోపాటు శంషాబాద్‌ తాహెర్‌ స్టూడియోలో దేవర చిత్రం కోసం వేసిన అండర్‌ వాటర్‌ సెట్‌లో పుష్ప-2 షూటింగ్‌ జరిగింది. అత్యంత రిస్కీ యాక్షన్  షాట్స్‌ తీశారు. హీరోతో అండర్‌ వాటర్‌ జరిగే ఓ ఫైట్‌ను తెరకెక్కించారని తెలిసింది. విలన్  గ్యాంగ్‌ను హీరో మట్టుపెట్టే సన్నివేశం అది. నీటిలో ఫైట్‌ అయ్యాక ఆ శవాల్ని లంగర్‌కు వేలాడదీసి పైకి తీసుకొచ్చే సన్నివేశాన్ని తాజాగా చిత్రీకరించారు. ఆ సన్నివేశం రొమాలు నిక్కబొడిచేలా ఉంటాయని చెబుతున్నారు.

Pushpa-2.jpg

ఇదిలా ఉంటే నంద్యాల జిల్లా యాగంటి దేవాలయంలో రష్మికపై పలు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. పుష్పరాజ్‌తో పెళ్లి తర్వాత దర్శనార్థం యాగంటి వెళ్లి అక్కడి స్వామికి కిరీటం బహుకరించే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

రామోజీ ఫిల్మ్‌సిటీలో 3000 మంది ఆర్టిస్ట్‌లతో చేసిన గంగమ్మ జాతర సన్నివేశాలు, పాట చిత్రీకరణ లావిష్‌గా ఉంటాయని చెబుతున్నారు. గంగమ్మ విగ్రహం సెట్‌ అంతా నేచురల్‌గా ఉంటుందని సమాచారం.

Updated Date - Mar 19 , 2024 | 05:57 PM