Pushpa 2: 'పుష్ప 2' హైదరాబాద్ ఈవెంట్ ఎక్కడంటే.. 'వెన్యూ ఫిక్స్'
ABN , Publish Date - Nov 25 , 2024 | 04:21 PM
'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ డిజాస్టర్ తర్వాత 'పుష్ప' మేకర్స్ తగిన జాగ్రత్తలతో ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఈవెంట్‌ని హైదరాబాద్‌లోని ఒక భారీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఎక్కడంటే?
రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో వరుస ఈవెంట్‌లతో అభిమానుల్లో హీట్ పెంచుతుంది 'పుష్ప ది రూల్' టీమ్. ఇప్పటికే పాట్నాలో ఫైర్ ఈవెంట్ తో అదరగొట్టిన టీమ్ ఆదివారం చెన్నై లో వైల్డ్ ఫైర్ ఈవెంట్ నిర్వహించారు. ఇంకా కలకత్తా, కొచ్చి, బెంగళూరు, ముంబయ్, హైదరాబాద్ లలో భారీ ఈవెంట్లు చేయాల్సి ఉంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఈవెంట్ ఎక్కడ నిర్వహిస్తారనే క్యూరియాసిటి ఏర్పడింది. ఎట్టకేలకు వెన్యూ ఫిక్స్ అయినట్లు పక్క సమాచారం అందింది. ఇంతకీ ఎక్కడంటే..
జూనియర్ ఎన్టీయార్ 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాప్ కావడంతో పెద్ద సినిమాల మేకర్స్ ఈవెంట్స్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. సాధారణంగా పెద్ద హీరో సినిమా ఈవెంట్ అంటే అభిమానులు తాకిడి గట్టిగానే ఉంటుంది. ఆ సినిమా ఇంకా పాన్ ఇండియా రిలీజ్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీయార్ లాంటి మాస్ హీరో సినిమాకి నోవాటెల్ హోటల్ లో ఫంక్షన్ నిర్వహించడం ఎంత పెద్ద తప్పిదమో తెలిసి వచ్చింది. ఈ నేపథ్యంలోనే మూడేళ్ళ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'బన్నీ' పుష్ప 2 ఈవెంట్ కోసం ఒక పెద్ద స్టేడియం ని ఎంపిక చేసుకున్నారు మేకర్స్. తాజాగా వెన్యూ కోసం పోలీసులు పర్మిషన్ కూడా ఇచ్చేశారు. యాసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో 'పుష్ప 2' ఈవెంట్ చేయనున్నారు.
ఇక 2021లో రిలీజైన 'పుష్ప' సినిమా కోసం ఎలాంటి ప్రమోషన్స్ చేయని విషయం తెలిసిందే. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే నార్త్ మార్కెట్‌ని కూడా షేక్ చేసిన క్రెడిట్ ఆ సినిమాకే చెందుతుంది. అయితే 'పుష్ప 2' చివరి క్షణం వరకు షూటింగ్ జరుపుకుంటున్న సందర్భంగా మేకర్స్ ఇలా భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేశారు.