Puri musings: అత్తతో గొడవ..భర్తతో గొడవ.. పోస్టులే పోస్టులు..
ABN , Publish Date - Dec 31 , 2024 | 10:04 AM
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri jagannath) ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పాడ్‌కాస్ట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆసక్తికరమైన అంశాల గురించి చెబుతూ స్ఫూర్తిని నింపే ఆయన తాజాగా సోషల్ మీడియా (Social media) వినియోగంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri jagannath) ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పాడ్‌కాస్ట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆసక్తికరమైన అంశాల గురించి చెబుతూ స్ఫూర్తిని నింపే ఆయన తాజాగా సోషల్ మీడియా (Social media) వినియోగంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘సోషల్ మీడియా అనేది చాలా పవర్‌ఫుల్ టూల్. అది జనాల్లోకి వచ్చిన దశలో కమ్యూనికేషన్ పెరిగిందనుకున్నాం. కానీ, రానురానూ అది మన జీవితాల్లో దెయ్యంలా మారింది. దాని వల్ల ఇతరులతో పోల్చుకోవడం ఎక్కువైంది. ప్రతి దాన్ని ఫొటో తీసి చూపించడం ఎక్కువైంది. భర్తతో కాపురం చేయడం కంటే.. తమ భాగస్వామితో అన్యోన్యంగా ఉన్నట్టు ఫొటోలు పోస్టు చేయడంతో చాలా మందికి ఆసక్తి పెరిగింది. కొత్త దుస్తులు ధరిస్తే ఓ ఫొటో తీయాలి. బెడ్ రూమ్‌లో ఓ ఫొటో, తింటునప్పుడు ఓ ఫొటో. ఇలా డిజిటల్ అడిక్షన్ పెరిగిపోయింది. దీనికి తోడు ట్రోలర్స్. మన చుట్టూ జాబ్‌లేని వారు ఎంతోమంది ఉన్నారు. మీరు చూపించే ఫోటోలు వారికి నచ్చవు. అసూయ పడతారు. బికినీ వేసుకుని మాల్దీవుల్లో దిగిన ఫొటో మీరు పంచుకుంటే.. అది చూసిన ట్రోలర్స్ కామెంట్స్ చేస్తారు.. కొందరు ప్రశ్నిస్తారు. మరికొందరు అసభ్యకరంగా మాట్లాడతారు. వాటన్నింటినీ చదువుతూ పనులు మానేసి మీరు ఏడుస్తూ పడుకుంటారు. ఎందుకంటే మీరు కూడా జాబ్‌లేని వారే! దాని వల్ల రోజూ మీరు కుంగిపోతూ బతుకుతారు’’ (New Resolution)
‘‘ఈ సోషల్ మీడియా పోస్టుల వల్ల ఎంతోమంది దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. బంధాలు దెబ్బతింటున్నాయి. 10 విడాకుల్లో 3 సోషల్ మీడియా కారణంగా అవుతున్నాయని తాజాగా నిర్వహించిన ఓ సర్వే తెలిపింది. మీ ఇంట్లో జరిగే గొడవలకు సోషల్ మీడియానే కారణం. మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నా.. పెళ్లైనా దయచేసి దానికి దూరంగా ఉండండి. మీ భర్తే ప్రపంచం అనుకున్నప్పుడు మిగిలిన ప్రపంచం మీకెందుకు? మీ కుటుంబం బాగుండాలని కోరుకుంటే అవన్నీ ఎందుకు? ప్రతి క్షణం మీ జీవితంలో ఏం జరుగుతుందోనని లైవ్ టెలికాస్ట్ ఆపేయండి. మీరు ఆనందంగా ఉన్నా పోస్టు పెట్టొద్దు. బాధలో ఉన్నా పోస్టు పెట్టొద్దు. ముఖ్యంగా అమ్మాయిలు. వాళ్ల ఇన్‌స్ట్టాగ్రామ్ చెక్ చేేస్త వాళ్లింట్లో ఏం జరుగుతుందో చెప్పేయొచ్చు. ఎవరితో ఏం గొడవ అవుతుందో ఊహించొచ్చు. అత్తతో గొడవ అయితే ఒక పోస్టు, భర్తతో గొడవ అయితే మరో పోస్టు. అది చూసి వెంటనే మరో మహిళ ఫోన్ చేస్తుంది. ‘ఎందుకో తెలియదు అక్కా.. నువ్వు కలలోకి వచ్చావ్. ఇంట్లో అంతా ఓకేగా’ అని మాట్లాడడం ప్రారంభిస్తుంది. మనం ఏడుస్తూ అన్నీ చెప్పేస్తాం. ఎందుకంటే మనకు బుద్థి లేదు.. కుటుంబ విషయాలు చెప్పకూడదనే ఇంగితజ్ఞానం కూడా లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి.. మీరు ఏ పోస్టు పెట్టినా నెగెటివిటీని ఆకర్షిస్తున్నట్టే. మీ కుక్క ఫొటో పెడితే.. తర్వాత అది హాస్పిటల్‌లో చేరుతుంది. మీ భర్త ఫొటో పెడితే ఆయన అనారోగ్యంతో కిందపడిపోతాడు. డైనింగ్ టేబుల్ వద్ద దిగిన గ్రూప్ ఫొటో పెడితే ఫుడ్ పాయిజన్ అయి ఎవరో ఒకరు చనిపోతారు. ఇతరుల ఏడుపు తగిలి.. మిమ్మల్ని దరిద్రం చుట్టుకుంటుంది. అందుకే నెగెటివిటీని అట్రాక్ట్ చేయొద్దు. ప్రపంచంలోని 5 బిలియన్ మంది సోషల్ మీడియాలోనే ఏడుస్తున్నారు. అందులో మన దేశం అగ్ర స్థానంలో ఉంది. నా మాట విని.. ముఖ్యంగా పెళ్లైన వారంతా సోషల్ మీడియాకు దూరంగా ఉంటామని కొత్త సంవత్సరంలో తీర్మానించుకోండి. మీ ఆలోచనలు మారుతాయి, జీవితాలు మారుతాయి, విడాకులు తగ్గుతాయి. ఈ రోజుల్లో డిజిటల్ డిటాక్స్ ఎంతో అవసరం. కనీసం ఒక్క నెల అయినా ప్రయత్నించంచి?. మనశ్శాంతి అంటే ఏంటో చూస్త్తారు’’ అంటూ ‘న్యూ రిజల్యూషన్’ టాపిక్ గురించి అని పేర్కొన్నారు.