Puri Musings: భార్యాభర్తలిద్దరూ ఒకే మంచం మీద పడుకుంటారు కానీ..

ABN , Publish Date - Apr 19 , 2024 | 06:48 PM

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ రియాలిటీకి దగ్గరగా ఉంటారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. అలాగే ఉండాలని హితవు పలుకుతారు. 'పూరి మ్యూజింగ్స్‌’లో తరచూ ఆయన ఇలాంటి విషయాలే చెబుతుంటారు. తాజాగా పెన్సిల్వేనియాలో నివసించే అమిష్‌ పీపుల్‌ గురించి పూరి జగన్నాథ్‌ వివరించారు.

Puri Musings:  భార్యాభర్తలిద్దరూ ఒకే మంచం మీద పడుకుంటారు కానీ..

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh)రియాలిటీకి దగ్గరగా ఉంటారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. అలాగే ఉండాలని హితవు పలుకుతారు. 'పూరి మ్యూజింగ్స్‌’లో (Puri Jagannadh Musings) తరచూ ఆయన ఇలాంటి విషయాలే చెబుతుంటారు. తాజాగా పెన్సిల్వేనియాలో నివసించే అమిష్‌ పీపుల్‌ గురించి పూరి జగన్నాథ్‌ వివరించారు. వారి (Amish people) గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.

‘‘అమిష్‌ పీపుల్‌ ఇప్పటికీ కరెంట్‌ వాడరు. ఇళ్లలో ఏసీ, ఫ్రిజ్‌, గ్రైండర్లు ఉండవు. స్మార్ట్‌ ఫోన్‌లు, టీవీల మాటే ఉండదు. కార్లు అసలే వాడరు. 18వ శతాబ్దంలో ఎలా బతికేవారు ఇప్పటికీ అలానే ఉన్నారు. పిల్లలను ఎక్కువగా చదివించరు. ఉమ్మడి కుటుంబాలను బాగా ఇష్టపడతారు. ఆదివారమంతా విశ్రాంతి తీసుకుంటారు. ప్రపంచంలోని మిగతా జనాలతో కలిసిపోయేందుకు ఆసక్తి చూపించరు. ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వరు. వాళ్ల జీవనశైలిని వీడియో తీయడానికి కూడా అంగీకరించరు. ఆడవాళ్లు మేకప్‌లు వేసుకోరు. పొగడ్తలకు దూరంగా ఉంటారు. ఇష్టపడరు కూడా. అందరూ క్రమశిక్షణతో ఉంటారు. ఎవరికైనా ఆపద వస్తే అందరూ సాయం చేస్తారు.  బంధువులకు విలువనిస్తారు. ప్రకృతిని గౌరవిస్తారు. వాళ్ల మత గ్రంథంలో చెప్పినట్లే జీవిస్తారు. ప్రపంచమంతా మారుతున్నా.. వాళ్లు మాత్రం 300 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో అలానే ఉంటున్నారు. అమిష్‌ పీపుల్‌ వాళ్లకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. ప్రకృతికి నష్టం వాటిల్లే పనులేవీ చేయరు. భార్యభర్తలిద్దరూ ఒకే మంచం మీద పడుకుంటారు కానీ.. మధ్యలో చెక్క అడ్డం పెట్టుకుంటారు. నిద్రపోయే సమయంలో ఒకరిని ఒకరు తాకకూడదని ఇలా చేస్తారు. సోషల్‌ మీడియా అంటే ఏంటో వాళ్లకు తెలియదు. అందుకే సంతోషంగా ఉన్నారు. ప్రతీ సాయంత్రం అందరూ కలిసి సరదాగా గడుపుతారు. త్వరగా నిద్రపోతారు. వాళ్లు చేస్తున్నది వందశాతం సరైనది. వాళ్ల మీద హాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. వీలైతే ఒకసారి చూడండి’’ అని పూరి జగన్నాథ్‌ అన్నారు. 

Updated Date - Apr 19 , 2024 | 06:53 PM