రేవంత్ రెడ్డి ని కలిసిన దిల్ రాజు, అందుకోసమేనా...

ABN , Publish Date - Feb 07 , 2024 | 01:20 PM

తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిశారు. కుటుంబంతో సహా వెళ్లి కలిసిన దిల్ రాజు ముఖ్యమంత్రిని తన సోదరుని కుమారుడు ఆశిష్ రెడ్డి వివాహానికి శుభలేఖ ఇచ్చి ఆహ్వానించారు.

రేవంత్ రెడ్డి ని కలిసిన దిల్ రాజు, అందుకోసమేనా...
Dil Raju with family members met Telangana Chief Minister Revanth Reddy and invited him to grace Ashish's grand wedding ceremony

తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు తన కుటుంబంతో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిశారు. దిల్ రాజు, అతని సోదరుడు శిరీష్, కుమార్తె, అల్లుడు, దిల్ రాజు సోదరుని కుమారుడు ఆశిష్ ఈరోజు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వున్నారు. అయితే ఇదేదో దిల్ రాజు పరిశ్రమ తరపున వెళ్లి కలిసింది కాదు, అతను వ్యక్తిగతంగా తన ఇంట్లో పెళ్లి వేడుకలకు ఆహ్వానించడానికి కలిశారు.

దిల్ రాజు సోదరుని కుమారుడు ఆశిష్ వివాహం త్వరలో జరగబోతోంది, అందుకే ఇటు పరిశ్రమలోని, అటు రాజకీయ, వ్యాపార రంగంలో వున్నవారిని దిల్ రాజు కుటుంబంతో సహా వెళ్లి వ్యక్తిగతంగా అందరికీ శుభలేఖలు ఇచ్చి పెళ్ళికి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రిని కలిసి ఆశిష్ వివాహానికి ఆహ్వానించారని తెలిసింది.

dilrajurevanth.jpg

కొన్ని రోజుల క్రిత్రం తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ని కూడా కలిసి శుభలేఖ అందచేశారు. అంతకు ముందు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ని కూడా కలిసి అహ్వాన పత్రిక అందచేశారు. ఇక పరిశ్రమలో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, వెంకటేష్ ఇలా అందరినీ వ్యక్తిగతంగా వెళ్లి కలిసి పెళ్ళికి పిలిచారు.

Updated Date - Feb 07 , 2024 | 01:20 PM