Allu Aravind: మ‌రో ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లంటే?

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:18 PM

కంటిన్యూగా సినిమాల‌తో బిజీగా ఉన్న అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ తాజాగా మ‌రో ఖ‌రీదైన కారును కొనుగోలు చేశారు.

Allu Aravind: మ‌రో ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లంటే?
allu aravind bmw

టాలీవుడ్‌లో వ‌రుస చిత్రాల‌తో మంచి జోరు మీదున్న నిర్మాత అల్లు అర‌వింద్ (Allu Aravind). ఇప్ప‌టికే గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఎన్నో చిత్రాల‌ను నిర్మించి విజ‌యాలు ద‌క్కించుకున్న ఆయ‌న ఈ మ‌ధ్య బ‌న్నీ వాస్ నిర్మాత‌గా గీతా ఆర్ట్స్ 2 (GA2 Pictures) బ్యాన‌ర్‌పై ఏర్పాటు చేసి నేటి యువ హీరోల‌తో వ‌రుస‌ చిత్రాలు రూపొందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్‌లో జూ.ఎన్టీఆర్ బావ‌మ‌రిది నార్నే నితిన్ క‌థానాయ‌కుడిగా ’ఆయ్‘ అనే సినిమా, గీతా ఆర్ట్స్ (Geetha Arts) ప్ర‌ధాన బ్యాన‌ర్‌లో నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా ‘తండేల్’ సినిమాలు తెర‌కెక్కిస్తున్నారు.

images.jpeg

అయితే.. కంటిన్యూగా సినిమాల‌తో బిజీగా ఉన్న అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ (Allu Aravind) తాజాగా మ‌రో ఖ‌రీదైన కారును కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. ఇప్ప‌టికే ఓ నాలుగైదు కార్లు ఉన్న ఆయ‌న రీసెంట్‌గా BMW i7 అనే ఈవీ (క‌రెంట్) కారును కోనుగోలు చేశారు. ఆ కారును స‌ద‌రు షో రూం నిర్వాహ‌కులు ఇటీవ‌లే అల్లు అర‌వింద్ (Allu Aravind) ఇంటికి హోం డెలీవ‌రీ చేయ‌గా అర‌వింద్ త‌న భార్య‌ను అందులో కూర్చోబెట్టుకుని కారు న‌డిపారు.

bmw-i7-mineral-white-metallic.jpg


bm.jpeg

ఇండియాలో బ‌హిరంగ మార్కెట్‌లో ఈ కారు విలువ రూ.2.5 కోట్ల వ‌ర‌కు ఉంది. ప్ర‌స్తుతం ఈ కార్ల‌ను బాలీవుడ్‌లో అజ‌య్ దేవ‌గణ్ వంటి ప‌లువురు ప్ర‌ముఖులు వాడుతుండ‌గా.. త‌మిళ‌నాట స్టార్ హీరో విజ‌య్ ఇటీవ‌ల ఇలాంటి కారును కొనుగోలు చేసిన‌ట్లు నెట్టింట వార్త‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

Updated Date - Apr 26 , 2024 | 12:20 PM