Jai Hanuman: అంతకు పదిరెట్లు.. హీరో ఎవరంటే!

ABN , Publish Date - Jan 22 , 2024 | 02:51 PM

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్  వర్మ (Prashanth varma) దర్శకత్వం వహించిన ‘హను-మాన్‌’ (Hanuman)చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే! సూపర్‌ హీరో కథకు ఇతిహాసాన్ని జోడించి ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్‌’ను (Jai hanuman) తెరకెక్కించనున్నారు.

Jai Hanuman: అంతకు పదిరెట్లు.. హీరో ఎవరంటే!

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్  వర్మ (Prashanth varma) దర్శకత్వం వహించిన ‘హను-మాన్‌’ (Hanuman)చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే! సూపర్‌ హీరో కథకు ఇతిహాసాన్ని జోడించి ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్‌’ను (Jai hanuman) తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని ఉద్దేశించి ప్రశాంత్‌ వర్మ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సీక్వెల్‌లో తేజ హీరో కాదని తెలిపారు. ‘హను-మాన్‌’ సక్సెస్‌లో భాగంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారు.

‘‘హను-మాన్‌’ కంటే వందరెట్లు భారీ స్థాయిలో  ‘జై హనుమాన్‌’ ఉండబోతోంది. ఈ సీక్వెల్‌లో తేజ సజ్జా హీరో కాదు. ‘జై హనుమాన్‌’లోనూ అతడు హనుమంతుడు  పాత్రలో కనిపిస్తాడు. కానీ, ఆ సినిమా హీరో ఆంజనేయ స్వామి. ఆ పాత్రను స్టార్‌ హీరో చేస్తారు. 2025లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. దీనికంటే ముందు నా నుంచి మరో రెండు చిత్రాలు రానున్నాయి. అందులో ఒకటి ‘అధీర’. మరొకటి ‘మహాకాళి’’ అని ప్రశాంత్‌ వర్మ వెల్లడించారు. రూ.45 కోట్ల బడ్జెట్‌తో ‘హను-మాన్‌’ చేశామని చిత్ర బృందం తెలిపింది. విడుదలైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లు వసూళ్లు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Jan 22 , 2024 | 03:48 PM