Prabhas: పెళ్లి గురించా? లేక సినిమాకు సంబంధించా?

ABN , Publish Date - May 17 , 2024 | 08:20 PM

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) శుక్రవారం ఇన్స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌ ఎంతగా వైరల్‌ అయిందో తెలిసిందే! ఆయన చేసిన పోస్ట్‌ టాక్‌ ఆఫ్‌ ద ఇండస్ట్రీగా మారింది.

Prabhas:  పెళ్లి గురించా? లేక సినిమాకు సంబంధించా?

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) శుక్రవారం ఇన్స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌ ఎంతగా వైరల్‌ అయిందో తెలిసిందే! ఆయన చేసిన పోస్ట్‌ టాక్‌ ఆఫ్‌ ద ఇండస్ట్రీగా మారింది. 'డార్లింగ్స్‌ ఎట్టకేలకు మన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు. వెయిట్‌ చేయండి’ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసిన ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో కమల్‌హాసన్ న్యూ లుక్‌ను విడుదల చేయబోతున్నారంటూ వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

తాజాగా వైజయంతీ మూవీస్‌ సంస్థ మరో పోస్ట్‌ చేసింది. 'భైరవుడి బుజ్జిని మీకు పరిచయం చేయడం కోసం ఎంతో ఎగ్ఝైటింగ్‌గా ఉన్నాం’’ అని వైజయంతీ సంస్థ పేర్కొంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ పాత్ర పేరు భైరవుడు. అతనికి జంటగా నటిస్తున్న దీపికా పడుకొణె లుక్‌ని రివీల్‌ చేస్తారేమో అని కూడా అనుకుంటున్నారు.

WhatsApp Image 2024-05-17 at 6.54.42 PM.jpeg

ఇదిలా ఉంటే 2022లో నాగ్‌ అశ్విన్  చేసిన ట్వీట్‌ ఒకటి ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ‘‘ఆనంద్‌ మహీంద్రా (Anand mahindra tweets viral) సర్‌, మేము ఇండియన్ సైన్స్  ఫిక్షన్  కథాంశంతో ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పడుకొణెతో Kalki 2898 ad చిత్రాన్ని నేటి టెక్నాలజీని ఉపయోగించి చేయబోతున్నాం. ఈ సినిమా అనుకున్నది సాధిస్తే అది మన జాతికే గర్వకారణం. ఎన్నో విషయాల్లో మీరు మాకు స్ఫూర్తి. మీ దగ్గర ప్రతిభావంతులైన భారతీయ ఇంజనీర్లు, అద్భుతమైన డిజైనర్ల బృందం ఉంది. ఇప్పటి దాకా ఈ తరహా చిత్రం ఎవరూ చేయలేదు. ఇలాంటి ప్రాజెక్ట్‌కు మీలాంటి వారు, మీ ఇంజనీర్లు సహాయం ఉంటే అది చాలా గౌరవంగా ఉంటుంది’’ అని నాగ్‌ అశ్విన్ (Nag ashwin) ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి ఆనంద్‌ మహీంద్ర కూడా రిప్లై ఇచ్చారు. "ఇలాంటి అవకాశం వస్తే మేమలా తిరస్కరిస్తాం నాగ్‌ అశ్విన్. మా సంస్థలో చీఫ్‌ గ్లోబల్‌ ప్రాడక్ట్‌ డెవలమెంట్‌ వేలు మహీంద్ర ఉన్నారు. ఆయన ఎక్స్‌యువీ700 డెవలప్‌ చేశారు. ఆయనలాంటి వారు మీ వెనక ఉంటారు’’ అని ఆనంద్‌ మహీంద్రా రిప్లై ఇచ్చారు. 2022లో చేసిన ఈ ట్వీట్లు ఇప్పుడు మరోసారి వైరల్‌ అవుతున్నాయి.

WhatsApp Image 2024-05-17 at 6.54.41 PM.jpeg
దీనిని బట్టి చూస్తే కల్కి చిత్రం కోసం మహీంద్ర కంపెనీ ప్రత్యేక కారుని డిజైన్ చేసిందేమో.. దానినే ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌గా చెబుతున్నారని నెటిజన్లు అంటున్నారు. అయితే తాజాగా వైజయంతీ సంస్థ చేసిన ట్వీట్‌తో హీరోయిన్  లుక్‌ని రివీల్‌ చేస్తారని టాక్‌. ఈ విషయం మీద ఓ క్లారిటీ రావాలంటే శనివారం సాయంత్రం 5 గంటలవరకే వేచి చూడాల్సిందే! 

Updated Date - May 17 , 2024 | 08:20 PM