scorecardresearch

Prabhas: రాజేంద్ర ప్ర‌సాద్‌కు.. ప్ర‌భాస్ ప‌రామ‌ర్శ‌

ABN , Publish Date - Oct 09 , 2024 | 04:54 PM

ఇటీవ‌ల టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి కన్నుమూసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌భాస్ బుధ‌వారం రాజేంద్రప్రసాద్ ఇంటికి స్వ‌యంగా వెళ్లి ప‌రామ‌ర్శించారు.

Prabhas: రాజేంద్ర ప్ర‌సాద్‌కు.. ప్ర‌భాస్ ప‌రామ‌ర్శ‌
prabhas

ఇటీవ‌ల టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) ఇంట విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆయ‌న‌ కుమార్తె గాయత్రి (Gayathri) (38) కార్డియక్ అరెస్టుతో గ‌త‌ శుక్రవారం రాత్రి హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రిలో కన్నుమూశారు. కూతురు మరణాన్ని తట్టుకోలేక రాజేంద్రప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చాలామంది టాలీవుడ్‌ ప్రముఖులు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) మరియు ఆత‌ని కుటుంబాన్ని పరామర్శించి త‌మ సంతాపం తెలియ‌జేస్తున్నారు.

ఈ క్ర‌మంలో నిన్న మంగ‌ళ‌వారం రోజున మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad)ను పరామర్శించారు. తాజాగా బుధ‌వారం రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ (Prabhas) రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించారు. ఈ రోజు మ‌ధ్యాహ్నం కూకట్‌పల్లి ఇందు విల్లాస్‌లోని రాజేంద్రప్రసాద్ ఇంటికి స్వ‌యంగా వెళ్లిన ప్ర‌భాస్ (Prabhas) ముందుగా గాయ‌త్రి చిత్ర‌ప‌టం వ‌ద్ద నివాళుల‌ర్పించి అనంత‌రం రాజేంద్రప్రసాద్‌ను వారి కుటుంబ స‌భ్యులను ప‌రామ‌ర్శించి ధైర్యం చెప్పారు.

Updated Date - Oct 09 , 2024 | 04:54 PM