Prabhas Kalki 2898AD Bujji: ప్ర‌భాస్‌.. బుజ్జి ప్ర‌త్యేక‌త‌లివే

ABN , Publish Date - May 24 , 2024 | 03:00 PM

పాన్ ఇండియా సూప‌ర్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 AD’. ఈ సినిమాకు సంబంధించి తాజాగా రివీల్ చేసిన బుజ్జికి సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Prabhas Kalki 2898AD Bujji: ప్ర‌భాస్‌.. బుజ్జి ప్ర‌త్యేక‌త‌లివే
bujji

పాన్ ఇండియా సూప‌ర్ స్టార్ ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 AD’ (Kalki2898AD). ఇప్ప‌టికే అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హ‌స‌న్‌, దీపికా ప‌దుకునే, దిశా ప‌టానీ వంటి భారీ తారాగ‌ణంతోనే సంచ‌ల‌నం సృష్టించింది ఈ సినిమా. చిత్రం ప్రారంభ‌మైన మొద‌టి రోజు నుంచి రోజుకోర‌క‌మైన ప్ర‌త్యేకత బ‌య‌టికి వ‌చ్చి నేష‌న‌ల్ వైడ్‌గా ట్రెండ్ అవుతుండ‌గా తాజాగా కోట్లు ఖ‌ర్చుపెట్టి మ‌రీ రెడీ చేసిన బుజ్జిని రివీల్ చేశారు. ఈ బుజ్జికి సంబంధించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Prabhas,

ఇప్పుడు చిత్రంలో ఓ కీల‌క రోల్ ప్లే చేస్తున్న బుజ్జి (bujji) అనే కారును ప‌రిచ‌యం చేయ‌డం కోసం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డ‌మే అశ్చ‌ర్యానికి గురి చేసింది. హాలీవుడ్‌లో మాత్ర‌మే త‌ర‌చూ జ‌రిగే ఇలాంటి కార్య‌క్ర‌మం ఇప్పుడు తెలుగునాట జ‌ర‌గ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈక్ర‌మంలో ఇప్పుడు స‌ర్వ‌త్రా కారు గురించిన స్పెషాలిటీస్, ఫీచ‌ర్స్ గురించి తెలుసుకోవ‌డానికి ప్రేక్ష‌కులు,ప్ర‌భాస్ అభిమానులు బాగా ఆస‌క్తి చూపుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ బుజ్జి గురించిన ఓ వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది..


ఇక విష‌యానికి వ‌స్తే.. ఇండియ‌న్ స్క్రీన్‌పై ఇంత‌వ‌ర‌కు రానీ, ఎవ‌రు చేయ‌ని విధంగా ఓ భారీ సినిమా చేస్తున్నాం మా ఆలోచ‌న‌ల‌కు, సినిమాకు త‌గిన కారు కావాలి సాయం చేయండంటూ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) గ‌త సంవ‌త్స‌రం మ‌న ఇండియ‌న్ వ్యాపార‌వేత్త‌, మ‌హేంద్ర య‌జ‌మాని ఆనంద్ మ‌హేంద్ర‌కు ట్వీట్ చేయ‌డం ఆయ‌న వెంట‌నే స్పందించ‌డంతో మొద‌టిసారి ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చి అందుకు సంబంధించిన ప‌నులు ప్రారంభించారు.

Prabhas,

క‌ట్ చేస్తే ఇప్పుడు ఆనంద్ మ‌హేంద్రా కంపెనీ, జాయోమ్ ఆటోమోటివ్ కంపెనీల సాయంతో త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరులో ఈ బుజ్జిని రెడీ చేశారు. ఇందుకోసం దాదాపు రూ.7 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేసిన‌ట్లు స‌మాచారం. అదేవిధంగా కారు 6 ట‌న్నుల బ‌రువుతో ఉండ‌గా దానికి ప్ర‌త్యేకంగా డిజైన్ చేయించిన టైర్ల‌ను మాత్ర‌మే ఉప‌యోగించారని తెలుస్తోంది. సుమారు 6075 మిమీ పొడ‌వు.. 3380మిమీ వెడ‌ల్పు, 2418 మిమీ ఎత్తుతో ఈ టైర్ల‌ను ప్ర‌ఖ్యాత సీయెట్ కంపెనీ త‌యారు చేసింది. అంతేకాకుండా వాటికి 34.5 ఇంచుల రిమ్‌ను వాడ‌డం విశేషం. పవర్ 94 Kw, బ్యాటరీ 47 KWH ల‌ను వినియోగించిన‌ట్లు నెట్టింట వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. జూన్ 27న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Updated Date - May 24 , 2024 | 03:19 PM