Kalki 2898AD Bujji: క‌ల్కి బుజ్జిని.. ఇక్క‌డ‌ లైవ్‌లో చూసేయండి

ABN , Publish Date - May 22 , 2024 | 06:18 PM

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బుజ్జి అని పిల‌వ‌బ‌డే కారును పూర్తి స్థాయిలో రివీల్ చేసే కార్య‌క్ర‌మం తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది. ఈ కార్య‌క్ర‌మం లైవ్ మీ కోసం

Kalki 2898AD Bujji: క‌ల్కి బుజ్జిని.. ఇక్క‌డ‌ లైవ్‌లో చూసేయండి
bujji

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ చిత్రం ‘కల్కి 2898 AD’ (Kalki 2898AD Movie). రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), కమల్ హాసన్ (Kamal Haasan) వంటి ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్‌తో సహా దీపికా పదుకొణె (Deepika Padukone), దిశా పటాని (Disha Patani) లాంటి ప్రముఖ తారాగణంతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని 27 జూన్, 2024న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.


వాస్తవానికి మే 9న ఈ చిత్రం విడుదలకావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల జూన్‌కి వాయిదా పడింది. ప్రస్తుతం మేకర్స్ చిత్ర ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలో రెండు మూడు రోజుల క్రితం ఈ సినిమా కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బుజ్జి అని పిల‌వ‌బ‌డే కారుకు సంబంధించి వివ‌రాలు రివీల్ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. రీసెంట్‌ గా ఓ చిన్న వీడియోను కూడా విడుద‌ల చేశారు. అయితే బుజ్జి (Bujji)ని పూర్తి స్థాయిలో రివీల్ చేసే కార్య‌క్ర‌మం తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది. ఈ కార్య‌క్ర‌మం లైవ్ మీ కోసం

Updated Date - May 22 , 2024 | 06:58 PM