ప్రభాస్ ‘కల్కి 2898 AD’.. ప్రమోషన్స్ కొత్త పుంతలు

ABN , Publish Date - Jan 12 , 2024 | 07:46 PM

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘కల్కి 2898 AD’. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేస్తున్నట్లుగా ఈ రోజు ఉదయం అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను నాగ్‌ అశ్విన్ అండ్ టీం వినూత్నంగా ప్లాన్ చేసింది.

ప్రభాస్ ‘కల్కి 2898 AD’.. ప్రమోషన్స్ కొత్త పుంతలు
kalki

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin), వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) సి. అశ్విని దత్ కాంబినేషన్లో వస్తున్న ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పోస్ట‌ర్స్, గ్లింప్స్‌ల‌కు ప్పంపచ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా మేకర్స్ సినిమాను తమకు తరాలుగా అచ్చి వచ్చిన మే 9న విడుదల చేస్తున్నట్లుగా ఈ రోజు ఉదయం అధికారికంగా ప్రకటించారు. ప్ర‌స్తుతం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో ముగించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను నాగ్‌ అశ్విన్ అండ్ టీం వినూత్నంగా ప్లాన్ చేసింది.

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఈ క్రమంలో 'కల్కి 2898 AD' నిర్మాతలు వారణాసి, ముంబై, ఢిల్లీ, చండీగఢ్, చెన్నై, మదురై, హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు, భీమవరం, విజయవాడ, కాశ్మీర్‌తో సహా పాన్-ఇండియాలోని పలు నగరాల్లో రైడర్‌ల ద్వారా గ్రాండ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.


ఇప్ప‌టికే ఈ సినిమాలో న‌టిస్తున్న రైడర్స్‌ను బాంబేలోని ఓ ఈవెంట్లో ప్ర‌ద‌ర్శించగా సాలిడ్ రెస్పాన్స్ రావడంతో తాజాగా ఆ రైడ‌ర్స్ కల్కి చిత్ర‌బృందం తాజాగా విడుద‌ల తేది పోస్ట‌ర్‌ను ప‌ట్టుకుని ముంబైలో షారుఖ్ ఖాన్ ఇంటి (మ‌న్న‌త్) ఎదుట,చెన్నైలో మెరీనా బీచ్ వద్ద ఇలా దేశంలోని అన్ని ప్రముఖ ప్రాంతాలలో రైడర్స్ ప్రచార పోస్టర్స్ ప్రదర్శించారు. ఈ ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఫుల్ వైర‌ల్‌గా మారగా అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.

Updated Date - Jan 12 , 2024 | 07:46 PM