Salaar 2: స‌లార్‌2పై ఫేక్ న్యూస్‌.. చెడుగుడు ఆడుకుంటున్న ఫ్యాన్స్‌! ఒక్క ఫొటోతో చెక్

ABN , Publish Date - May 26 , 2024 | 01:05 PM

ఈ సోష‌ల్ మీడియా ఉందే..ఫేక్ న్యూస్‌తో గ‌బ్బు గ‌బ్బు లేపులోందంటూ నెటిజ‌న్లు బాగా ఫైర్ అవుతున్నారు. తాజాగా ప్ర‌భాస్ స‌లార్ సినిమా విష‌యంలో ఇలాంటి న్యూసే ప్ర‌చార‌మ‌వ‌డంతో మేక‌ర్స్ స్వ‌యంగా రంగంలోకి దిగాల్సి వ‌చ్చిందంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు.

Salaar 2: స‌లార్‌2పై ఫేక్ న్యూస్‌.. చెడుగుడు ఆడుకుంటున్న ఫ్యాన్స్‌! ఒక్క ఫొటోతో చెక్
saalar

మీ పెద్ద వాళ్లున్నారే.. మా ప్రేమ‌ను అస‌లు అర్ధం చేసుకోలేరు అన్న డైలాగ్ ఎంత ఫేమ‌సో అంద‌రికి తెలిసిందే. అచ్చం అలాగే ఈ సోష‌ల్ మీడియా ఉందే..ఫేక్ న్యూస్‌తో గ‌బ్బు గ‌బ్బు లేపులోందంటూ నెటిజ‌న్లు ఇప్పుడు బాగా ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా సినిమాల విష‌యంలో అయితే ఈ షేక్ న్యూస్ చేసే ర‌చ్చ‌కు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తాజాగా ప్ర‌భాస్ (Prabhas) స‌లార్ (Salaar) సినిమా విష‌యంలో ఇలాంటి ఘ‌ట‌నే జ‌ర‌గ‌డంతో మేక‌ర్స్ స్వ‌యంగా రంగంలోకి దిగి స్పందించాల్సి వ‌చ్చిందంటే ఈ న్యూస్ ఎంత‌గా ప్ర‌చారం అయిందో అర్ధం చేసుకోవ‌చ్చు.

విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో ఓ అకౌంట్ నుంచి స‌లార్ 2 (Salaar 2) సినిమా ఆగి పోయింద‌ని ఇక ప‌ట్టా లెక్క‌దు అన్న‌ట్టుగా స‌ద‌రు నిర్మాత స్వ‌యంగా వ‌చ్చి వాళ్ల‌కు ప్ర‌త్యేకంగా చెప్పారా అన్న రీతిలో వాళ్ల‌కు తోచిన న‌చ్చిన విధంగా రాసి పోస్టు చేశారు. ఇంకేముంది ఆ వార్తలో నిజం ఎంత అబ‌ద్దం ఎంతో తేల్చుకోకుండానే పోతే దొర‌క‌దు అన్న‌చందాన వాళ్ల‌ను ఫాలో అయ్యే వారు ఈ వార్త‌ను తెగ షేర్ చేశారు. దీంతో ఒక‌టి రెండు రోజుల్లో ఈ వార్త సామాజిక మాధ్య‌మాల్లో పెద్ద దుమార‌మే రేపింది. ప్ర‌భాస్ అభిమానులైతే అస‌లు ఏమౌతుందో అర్ధం కాక ఈ వార్త నిజ‌మా అని అన్ని సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫాంల‌లో వాక‌బు చేశారు కూడా.


ఈ వార్త కాస్త సినిమా నిర్మాత‌ల దృష్టికి పోవ‌డంతో వారు ఖంగు తిని స్వ‌యంగా రంగంలోకి దిగారు. ఈ క్ర‌మంలో తాజాగా ప్ర‌భాస్ (Prabhas) , ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ (Prashanth Neel) స‌లార్‌ సినిమా సెట్‌లో హ్యాపీగా న‌వ్వుకుంటూ ఉన్న ఫొటోను విడుద‌ల చేసి సినిమాపై వ‌స్తున్న వ‌దంతుల‌కు చెక్ పెట్టారు. ఆ ఫొటో కూడా మీ వార్త‌ల‌కు మేం న‌వ్వుకుంటున్నాం అన్న‌ట్లుగా ఉండ‌డంతో స‌లార్ చిత్రంపై వ‌స్తున్న వార్త‌ల‌న్నీ రూమ‌ర్సేన‌ని వాటిని న‌మ్మొద్దు అంటూ ఆ ఫొటోను రిలీజ్ చేసిన‌ట్లు అంద‌రికి తెలిసి పోయింది. దీంతో ప్ర‌భాస్ అభిమానులు కూడా ఊపిరి పీల్చుకుని ఫేక్ న్యూస్ ప్ర‌చారం చేస్తున్న వారిని ట్యాగ్ చేసి మ‌రీ ఓ రేంజ్‌లో సీరియ‌స్ అయ్యారు. బూతుల వ‌ర్షం కురిపించారు. ఇప్పుడు ఆ ఫొటో పాటు అభిమానుల రియాక్ష‌న్ కూడా నెట్టింట బాగా వైర‌ల్ అవుతున్నాయి.

salaar.jpg

అంతేగాక గ‌త డిసెంబ‌ర్‌లో విడుద‌లైన స‌లార్ పార్ట్ 1 (Salaar) ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు.రూ 750 కోట్ట‌కు పైగా వ‌సూళ్లు సాధించి అంత పెద్ద విజ‌యం సాధిస్తే మెడ‌కాయ్ మీద త‌ల‌కాయ్ ఉన్న‌వాడు ఇలాంటి వార్త‌లు ఎలా పుట్టిస్తారంటూ చెడుగుడు ఆడుకుంటున్నారు. స‌లార్ పార్ట్ 1తో ఓ స్థాయిలో లాభాలు రావ‌డ‌మే కాకుండా.. ఇప్పుడు ప్ర‌పంచ‌మంతా స‌లార్ (Salaar 2) పార్ట్ 2 ఎప్పుడొస్తుందా అని వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్న‌దని అలాంటిది సినిమాను ఎందుకు సెల్వ్ చేస్తారంటూ ఫేక్ న్యూస్ సృష్టిస్తున్న‌ వారికి చుర‌క‌లు అంటిస్తున్నారు.

Updated Date - May 26 , 2024 | 01:05 PM