Kalki 2898 AD Trailer: ‘కల్కి 2898 ఏడీ’ ట్రైల‌ర్‌.. మాటల్లేవ్‌ గూస్‌బ‌మ్సే!

ABN , Publish Date - Jun 10 , 2024 | 07:36 PM

చాలాకాలంగా సినిమా ప్ర‌భాస్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న రోజు, స‌మ‌యం రానే వ‌చ్చేసింది. మేక‌ర్స్ చెప్పిన విధంగానే రాత్రి 7 గంట‌ల‌కు ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

Kalki 2898 AD Trailer: ‘కల్కి 2898 ఏడీ’ ట్రైల‌ర్‌.. మాటల్లేవ్‌ గూస్‌బ‌మ్సే!
kalki

చాలాకాలంగా సినిమా ప్ర‌భాస్ ( Prabhas) అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న రోజు, స‌మ‌యం రానే వ‌చ్చేసింది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌ల చేసుకుంటూ వ‌చ్చిన అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె లుక్స్, గ్లిమ్స్‌, బుజ్జి వీడియో ఇలా అన్ని సినిమాపై అంచ‌నాల‌ను రెట్టింపు చేశాయి. ఈ క్ర‌మంలో తాజాగా మేక‌ర్స్ చెప్పిన విధంగానే రాత్రి 7 గంట‌ల‌కు ‘కల్కి 2898 ఏడీ’ (Kalki) సినిమా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

GPt5AbFa8AAeCEg.jpeg

ట్రైల‌ర్ అశించిన‌ట్టుగానే హీలావుడ్ రేంజ్‌లో ఉండ‌గా విజువ‌ల్స్ అంత‌కుమించి అనే స్థాయిలోనే ఉన్నాయి. బ్ర‌హ్మానందం, అమితాబ్‌, దీపికా, దిశా ప‌టానిల సీన్స్ బావున్నాయి. ముఖ్యంగా ట్రైల‌ర్ చివ‌ర‌లో వ‌చ్చే క‌మ‌ల్ హ‌స‌న్ సీన్ అయితే గూస్‌బమ్స్ తెచ్చేలా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా హాలీవుడ్ రేంజ్‌లోనే ఉంది.

kalki.jpg


GPt5nenaoAA3Pkx.jpeg

వైజయంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో లోకనాయకుడు కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌ వంటి లెజెండరీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

GPt4mNKakAAkVPk.jpeg

Updated Date - Jun 10 , 2024 | 07:37 PM