ప్ర‌భాక‌ర్‌, ఆమ‌ని జంట‌గా.. ఈ రోజు నుంచే జెమినీ టీవీలో కొత్త సీరియ‌ల్

ABN , Publish Date - Jan 08 , 2024 | 06:55 PM

తెలుగు ప్రేక్షకుల వినోదానికి కేరాఫ్ అడ్రస్ జెమినీ టీవీ. ఎన్నో కార్యక్రమాలను, మరిన్నో సీరియల్స్ ను మనకు అందించిన జెమినీ టీవీ.. ఇప్పుడు “కొత్తగా రెక్కలొచ్చెనా ” అనే సరికొత్త సీరియల్ ను నేటి నుంచి (జనవరి 8) నుంచి ప్రసారం చేస్తోంది.

ప్ర‌భాక‌ర్‌, ఆమ‌ని జంట‌గా.. ఈ రోజు నుంచే జెమినీ టీవీలో కొత్త సీరియ‌ల్
kottaga rekkalochena

తెలుగు ప్రేక్షకుల వినోదానికి కేరాఫ్ అడ్రస్ జెమినీ టీవీ (Gemini TV). ఎన్నో కార్యక్రమాలను, మరిన్నో సీరియల్స్ ను మనకు అందించిన జెమినీ టీవీ.. ఇప్పుడు “కొత్తగా రెక్కలొచ్చెనా ”(kottaga rekkalochena) అనే సరికొత్త సీరియల్ ను నేటి నుంచి (జనవరి 8) నుంచి ప్రసారం చేస్తోంది.

అందమైన పల్లెటూరి రైతుబిడ్డ కావేరి! తను ప్రేమించిన బావ నమ్మక ద్రోహం వల్ల.. ఒక వైపు తన తల్లి బందీగా మారినా , మరో వైపు తోడబుట్టిన చెల్లెలి భవిష్యత్తు ప్రశ్న‌గా మరీనా.. ఈ పరిగెత్తే ప్రపంచంలో తన వాళ్ళ కోసం ఓ రైతుగా, ఆత్మస్ధైర్యాన్ని కోల్పోకుండా ఎలా నిలబడిందో తెలిపే కావేరి కథే.. “కొత్తగా రెక్కలొచ్చేనా ”.


ఈ క్ర‌మంలో పల్లెను వదిలి తన వాళ్ల కోసం పట్నం బయలుదేరిన కావేరి, రైతుగా.. తాను కోల్పోయినవన్నీ తిరిగి ఎలా దక్కించుకుందనే.. కథాంశంతో నిర్మితమైన ఈ సీరియల్‌లో సినీ నటి ఆమనీ, బుల్లితెర స్టార్ ప్రభాకర్ , సెల్వరాజ్, నిత్యా, అజయ్ ,కావ్య, తదితర నటీనటులు నటించారు.

నేటి నుంచి (జనవరి 8) సోమవారం సా 6 గం.లకు జెమిని టీవి (Gemini TV) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ “కొత్తగా రెక్కలొచ్చెనా ”(kottaga rekkalochena) సీరియల్ ప్రేక్షకుల ఆధారాభిమానాలను పొందడంలో ఎలాంటి సందేహం లేదని జెమినీ టీవీ యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది.

Updated Date - Jan 08 , 2024 | 06:55 PM