NTR Prashanth Neel Movie: తారక్‌ బర్త్‌డేకి సర్‌ప్రైజ్‌

ABN , Publish Date - May 17 , 2024 | 04:33 PM

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజు వేడుకకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఆయన పుట్టినరోజు అంటే అభిమానులకు పండగే. ఇక తారక్‌ నటిస్తున్న చిత్రాల అప్‌డేట్స్‌ కోసం, ఎలాంటి సర్‌ప్రైజ్‌ ఇస్తారోనని వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్.

NTR Prashanth Neel Movie:  తారక్‌ బర్త్‌డేకి సర్‌ప్రైజ్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (Ntr) పుట్టినరోజు వేడుకకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఆయన పుట్టినరోజు అంటే అభిమానులకు పండగే. ఇక తారక్‌ నటిస్తున్న చిత్రాల అప్‌డేట్స్‌ కోసం, ఎలాంటి సర్‌ప్రైజ్‌ ఇస్తారోనని వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్.  ఈ నేపథ్యంలో ఆయా చిత్రాల మేకర్స్‌ తారక్‌ పుట్టినరోజు ట్రీట్‌ కోసం స్పెషల్స్‌ రెడీ చేస్తున్నారు. ఇప్పటికే ‘దేవర’ (Devara) నుంచి రానున్న ఫస్ట్‌ సింగిల్‌కు మరింత హైప్‌ రాగా, ఇప్పుడు ఆయన నటించనున్న మరో చిత్రం నుంచి ఓ వార్త వైరల్‌ అవుతోంది.

జూనియర్‌ ఎన్టీఆర్‌, ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth neel) కాంబినేషన్‌లో ఎన్ఠీఆర్‌31’ (Ntr 31) మూవీ కోసం ఓ పవర్‌ఫుల్‌ టైటిల్‌ను ఫిక్స్‌ చేశారట. ‘డ్రాగన్‌’ అనే పేరులో పరిశీలనలో  ఉందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. అయితే దాదాపు ఇదే టైటిల్‌ ఖరారు అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ అదే ఫైనల్‌ అయితే తారక్‌ పుట్టిన రోజు సందర్భంగా మే 20న ఫస్ట్‌ లుక్‌ విడుదల అవకాశం ఉందట. ఈ చిత్రం షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుందని ఇటీవల దర్శకుడు ఓ కార్యక్రమంలో చెప్పారు. ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం స్ర్కిప్ట్‌కు ఫైనల్‌ టచ్‌ ఇచ్చే పనిలో ఉన్నారట.  ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా ప్రారంభించారు. తారక్‌ ప్రస్తుతం వరుస షూటింగుల్లో బిజీగా ఉన్నందున ఆ చిత్రీకరణ పూర్తయ్యాకనే ‘ఎన్‌టీఆర్‌ 31’ సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం తారక్‌ దేవర, వార్‌ 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు.  

Updated Date - May 17 , 2024 | 05:38 PM