Gabbar Singh: కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు

ABN , Publish Date - May 11 , 2024 | 12:21 PM

‘నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది’ నేను చెప్పినా ఒకటే.. నా ఫ్యాన్స్ చెప్పినా ఒకటే.. నీకు పై కమాండ్‌ టికెట్‌ ఇచ్చినా.. ఈ గబ్బర్‌సింగ్‌ టికెట్‌ ఇవ్వడు..

Gabbar Singh:  కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు

‘నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది’
నేను చెప్పినా ఒకటే.. నా ఫ్యాన్స్ చెప్పినా ఒకటే..
నీకు పై కమాండ్‌ టికెట్‌ ఇచ్చినా.. ఈ గబ్బర్‌సింగ్‌ టికెట్‌ ఇవ్వడు..
'ఎందుకురా ఈ గబ్బర్‌సింగ్‌ని కెలికాను అనుకోకపోతే..
అలా నీతో అనిపించకపోతే.. నేనేంటో.. వాళ్లకి తెలుసు..’
నాకు నువ్వే కాదు.. ఎప్పుడు ఎవ్వడూ పోటీ రాలేదు..
నాకు నేనే పోటీ..  నాతో నాకే పోటీ
రేయ్‌ అప్పుడే అయిపోయిందనుకోకు.. ఇప్పుడే మొదలైంది...
నా తిక్క ఏంటో చూపిస్తా.. అందరి లెక్కలూ తేలుస్తా... (
Gabbarsingh)

ఈ డైలాగ్‌లు థియేటర్లో దద్దరిల్లి పుష్కరకాలమైంది. 'పాటొచ్చి పదేళ్లైంది ఇంకా క్రేజ్‌ తగ్గలేదు’ అన్నట్టు సినిమా వచ్చి పన్నెండేళ్లు దాటుతున్నా క్రేజ్‌ మాత్రం ఇంకా తగ్గలేదు. ఇప్పటికి గబ్బర్‌సింగ్‌ క్రేజ్‌, ట్రెండ్‌ అలాగే నడుస్తోంది. పదేళ్లు గడిచి, పది సినిమాలు ఫ్లాప్‌ అయిన తర్వాత పవన్  కల్యాణ్‌కు (Pawan kalyan) వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ ఇది. హరీష్  శంకర్‌ (Harish Shankar) దర్శకత్వంలో పవన్  కల్యాణ్‌ హీరోగా నటించిన 'గబ్బర్ సింగ్'  2012 మే 11న విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం పవన క్రేజ్‌కు తగ్గట్టే బ్లాక్‌ బస్టర్‌ అయింది. మండుటెండలో బాక్సాఫీసు వద్ద కురిపించింది వసూళ్ల వర్షం. ఒక ట్రెండ్‌ సెట్‌ చేసింది. ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు.. మొదట ఈ చిత్రంలో నటించడానికి పవనకల్యాణ్‌ అంగీకరించలేదట. ఆ విషయాలను ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. (Gabbarsingh completes 12 years)

pawan.jpg
‘గబ్బర్‌ సింగ్‌’ చిత్రాన్ని తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. ‘దబాంగ్‌’ రీమేక్‌ నేను చేేస్త బాగుంటుందంటూ ఆ చిత్రం విడుదలైన 2- 3 నెలల తర్వాత నాకు చూపించారు. అది చూశాక ఇలాంటి సినిమాలో నేనెలా నటించాలో నాకు అర్థం కాలేదు. ఈ చిత్ర కథనమంతా సల్మాన్‌ఖాన్‌ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా ఉంటుంది. చాలా సినిమాల్లో చూపించినట్టు ఇందులోనూ తల్లి, కొడుకు కథే కదా.. కొత్తదనం ఏముంది..? అని అనిపించి, నేను చేయలేనన్నా. కానీ, కొన్ని రోజుల తర్వాత తక్కువ బడ్జెట్‌లో త్వరగా పూర్తయ్యే ఓ చిత్రం చేయాలని నిర్ణయించుకున్నా. అదే సమయంలో ‘దబాంగ్‌’ గుర్తొచ్చి మరోసారి చూశా. ఆ రీమేక్‌లో నటించేందుకు సిద్థమయ్యా. ఈ చిత్రంలోని పోలీసు పాత్ర ఎలా ఉండాలో నేనే డిసైడ్‌ చేశా. ఇందులో హీరో తన వృత్తి పట్ల నిబద్ధతతో ఉంటాడు. కానీ, డ్రెస్సింగ్‌ స్టైల్‌, వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటాయి. ‘గుడుంబా శంకర్‌’లోని ఓ సన్నివేశంలో నేను చేసిన పోలీసు పాత్రను ఇందుకు స్ఫూర్తిగా తీసుకున్నా’’ అని చెప్పారు పవన్. (Shruth Haasan)Gabbar-singh.jpg‘‘గబ్బర్‌సింగ్‌లో నా పాత్ర పేరు వెంకటరత్నం నాయుడు అయినా అందరూ ‘గబ్బర్‌ సింగ్‌’ అంటుంటారు. ఈ పేరు పెట్టడానికి కారణం.. ఒకప్పుడు ఓల్డ్‌ సిటీలో ఉన్న ఓ పోలీసు అధికారి. అప్పట్లో అందరూ ఆయన్ను గబ్బర్‌ సింగ్‌ అని పిలిచేవారు. ఆయన్ను నేను చూశా. కానీ, పరిచయం లేదు. ఆ పేరు నాకు చాలా నచ్చింది. అలా ఈ చిత్రంలోని పోలీసు పాత్రను చూశాక దానికి ‘గబ్బర్‌ సింగ్‌’ పేరైతేనే సరిపోతుందని ఫిక్స్‌ అయ్యా’’ అని అన్నారు.

పదేళ్ల తర్వాత పవన్  అందుకున్న భారీ విజయమిది. అంతే కాదు అప్పటి దాకా వరుస పరాజయాల్లో ఉన్న శ్రుతి హాసన్‌ను హీరోయిన్‌గా ఓకే చేసారు. ఈ చిత్రంతో శృతి కెరీర్ మలుపు తిరిగింది. 

ఈ చిత్రానికంటే ముందు హరీష్  శంకర్‌ పవన్ కు  ఓ స్టోరీ లైన్ చెప్పారు. దానికి ‘రొమాంటిక్‌ రిషి’ అనే పేరు అనుకున్నారు. అదే రవితేజ హీరోగా వచ్చిన ‘మిరపకాయ్‌’.

Shruthi.avif

రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. 306 కేంద్రాల్లో 50 రోజులు పైగా, 65 కేంద్రాల్లో 100 రోజులకుపైగా ప్రదర్శితమై, రికార్డు సృష్టించింది.

ఈ చిత్రంలో మాటలు, పాటలు దగ్గర నుంచి నేపథ్య సంగీతం వరకూ అన్ని ప్లస్సే. సినిమా విజయంలో సంగీతం ప్రధాన పాత్ర పోషిస్తుందనడానికి ఈ చిత్రం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజికల్‌ మ్యాజిక్‌ ఇప్పటికీ అలరిస్తూనే ఉంటుంది.

అభిమన్యుసింగ్‌, తనికెళ్ల భరణి, సుహాసినీ, రావు రమేష్, గబ్బర్‌సింగ్‌ అంత్యక్షరి టీమ్‌ ఇలా ప్రతీది సినిమాకు ఎసెట్‌గా నిలిచాయి.

 
పవన్ కు భక్తుడైన నిర్మాణ బండ్ల గణేష్‌ తీనమార్‌తో పరాజయం చవిచూసి, ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నారు.

Updated Date - May 11 , 2024 | 12:39 PM