OG: అత్తారింటికి దారేది సెంటిమెంట్‌ కలిసొచ్చేలా! 

ABN , Publish Date - Jan 30 , 2024 | 05:09 PM

పవర్‌స్టార్‌ పవన్ కళ్యాణ్  (Pawan kalyan) హీరోగా సుజీత్  రూపొందిస్తున్న  గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ఓజీ (OG) తాజాగా  ఈ చిత్రం విడుదలపై  నెట్టింట ఓ వార్త వైరల్‌ అవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 27న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి రానున్నట్లు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

OG: అత్తారింటికి దారేది సెంటిమెంట్‌ కలిసొచ్చేలా! 


పవర్‌స్టార్‌ పవన్ కళ్యాణ్  (Pawan kalyan) హీరోగా సుజీత్  రూపొందిస్తున్న  గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ఓజీ (OG) తాజాగా  ఈ చిత్రం విడుదలపై  నెట్టింట ఓ వార్త వైరల్‌ అవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 27న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి రానున్నట్లు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. పవన్‌ కళ్యాణ్‌ నుంచి వస్తున్న స్ట్రెయిట్  సినిమా కావడంతో  ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ చిత్రం 'అత్తారింటికి దారేది’ కూడా అదే తేదీన విడుదలైంది. ఆ రిలీజ్‌ డేట్‌ సెంటిమెంట్‌ ఓజీకి పనికొస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. (Og Release date)

గ్యాంగ్‌స్టర్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్  కథానాయిక. ఇమ్రాన్ హస్మీ విలన్ గా నటిస్తున్నారు. శ్రియా రెడ్డి, అర్జున్‌ దాస్‌, ప్రకాష్‌ రాజ్‌, హరీష్‌ ఉత్తమన్‌, అభిమన్యు సింగ్‌, వెంకట్‌ కీల పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే 75 శాతం చిత్రీకరణ పూర్తయింది. మరో 15రోజులు పవన్ షూటింగ్‌లో పాల్గొంటే సినిమా మొత్తం పూర్తయినట్టే అని టాక్‌. డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ స్వరకర్త. 


Updated Date - Jan 30 , 2024 | 05:09 PM