ఏపీలో ఎలక్షన్స్.. ఫిబ్రవరిలో కెమెరామెన్ గంగతో రాంబాబు రీ రిలీజ్

ABN , Publish Date - Jan 30 , 2024 | 08:35 PM

దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన "కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం ప్రేక్షకాభిమానులను ఎంతగానో అలరించిన విషయం గుర్తుండే ఉంటుంది. త్వరలో ఎలక్షన్స్ జరగబోతున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఏపీలో ఎలక్షన్స్.. ఫిబ్రవరిలో కెమెరామెన్ గంగతో రాంబాబు రీ రిలీజ్
pk

దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన "కెమెరామెన్ గంగతో రాంబాబు (Cameraman Gangatho Rambabu) చిత్రం ప్రేక్షకాభిమానులను ఎంతగానో అలరించిన విషయం గుర్తుండే ఉంటుంది. త్వరలో ఎలక్షన్స్ జరగబోతున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) జంటగా పూరి జగన్నాథ్ (puri jagannadh) దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం 2012వ సంవత్సరం అక్టోబర్ లో 1600 పైగా స్క్రీన్స్ లో విడుదలై సంచలనం సృష్టించిన విషయం గుర్తుండే ఉంటుంది.

రాంబాబుగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), గంగ పాత్రలో తమన్నా (Tamannaah) కనిపిస్తారు. మెకానిక్ అయిన రాంబాబు అన్యాయాలను ఎదురించే దైర్యశాలిగా గంగను ఆకట్టుకుంటాడు. రాంబాబు మెకానిక్ గా కంటే జర్నలిస్టుగా అయితేనే బావుంటుందని భావించిన టీవీ చానల్ కెమెరామెన్ అయిన గంగ అతనిని జర్నలిస్టుగా చేర్పిస్తుంది. ఈ నేపథ్యంలో సొసైటీలో జరిగే అరాచకాలను వారు ఎలా ఎదుర్కొన్నారన్న కధాంశంతో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది.


మణిశర్మ (Manisharma) సంగీతం, శ్యాం కె.నాయుడు ఛాయాగ్రహణం ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా ఇప్పడు ఈ సినిమా "కెమెరామెన్ గంగతో రాంబాబు (Cameraman Gangatho Rambabu)ను ఫిబ్రవరిలో అనుకూలమైన మంచి తేదీని చూసుకుని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత నట్టి కుమార్ తెలిపారు.

Updated Date - Jan 30 , 2024 | 08:35 PM