Varun Tej: దేశభక్తిని రెట్టింపు చేస్తుంది... సెల్యూట్‌ చెయ్యాల్సిందే!

ABN , Publish Date - Feb 20 , 2024 | 04:51 PM

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ (Varun tej) కథానాయకుడిగా నటిస్తున్న బిగ్గెస్ట్‌ ఏరియల్‌ వార్‌ డ్రామా 'ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (Operation Valentine). ఈ చిత్రం హిందీ ట్రైలర్‌ను సల్మాన్‌ఖాన్‌ (salman khan), తెలుగు ట్రైలర్‌ను రామ్‌చరణ్‌ (Ram charan) విడుదల చేశారు.

Varun Tej: దేశభక్తిని రెట్టింపు చేస్తుంది... సెల్యూట్‌ చెయ్యాల్సిందే!


మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ (Varun tej) కథానాయకుడిగా నటిస్తున్న బిగ్గెస్ట్‌ ఏరియల్‌ వార్‌ డ్రామా 'ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (Operation Valentine). ఈ చిత్రం హిందీ ట్రైలర్‌ను సల్మాన్‌ఖాన్‌ (salman khan), తెలుగు ట్రైలర్‌ను రామ్‌చరణ్‌ (Ram charan) విడుదల చేశారు. ఇందులో ఐఎఎఫ్‌ అధికారి అయిన అర్జున్‌ దేవ్‌ (వరుణ్‌) గతంలో జరిగిన ఒక సంఘటన కారణంగా పీడకలలు వస్తుంటాయి. కానీ అది అతని వైఖరి, విధానాన్ని మార్చలేదు. అతను మొండి పట్టుదల గలవాడు. రాడార్‌ ఆఫీసర్‌ సోనాల్‌ (మానుషి చిల్లర్‌)తో ప్రేమలో ఉన్న అడ్వంచర్‌ పవర్‌. మరోవైపు పుల్వామా దాడిలో 42 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు మరణిస్తారు. ఇంతకుముందు ఓటమిని ఎదుర్కోని భారత వైమానిక దళం శత్రువులపై వైమానిక దాడిని ప్రకటిస్తుంది. టీంకు నాయకత్వం వహిస్తున్న అర్జున్‌ తన యుద్థ విమానానికి గ్రెనేడ్‌ తగలడంతో ప్రమాదంలో పడతాడు. అయితే, అతనికి మార్గనిర్దేశం చేసేందుకు రాడార్‌ ఆఫీసర్‌ సోనాల్‌ వుంటుంది. వరుణ్‌ తేజ్‌ అడ్వంచరస్‌ స్క్వాడ్రన్‌ లీడర్‌గా అద్భుతంగా ఆకట్టుకున్నాడు. యాక్షన్‌, ఎమోషనల్‌ సీన్స్‌ రెండింటిలోనూ అదరగొట్టారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది.


వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ "మన దేశంలో సినిమా అనేది బిగ్గెస్ట్‌ ఎంటర్‌టైనమెంట్‌. సరదాగా కాలక్షేపం చేయాలంటే అందరు ముందు సినిమా వైపు వెళ్తారు. ప్రేక్షకులు కష్టపడి సంపాదించిన డబ్బుని టికెట్‌ రూపంలో మాకు ఇస్తారు. ప్రేక్షకుల ఖర్చుపెట్టే డబ్బులకి న్యాయం చేయాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వడానికి కష్టపడుతుంటాను. ప్రేక్షకులకు కొత్త కథ చూపించాలనే ప్యాషన్‌ నాకు, మా టీంకు వుంది. అందుకే  ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’లాంటి సినిమాని తీయగాలిగాం. తెలుగులో మొట్టమొదటి ఏరియల్‌ ఫిల్మ్‌ అవ్వబోతుంది. చాలా కొత్తగా, ఎడ్జ్‌ అఫ్‌ ది సీట్‌ కూర్చుని గూస్‌ బంప్స్‌ మూమెంట్స్‌ని ఎంజాయ్‌ చేేస చాలా సీన్స్‌ ఇందులో ఉన్నాయి. మార్చి 1న ఈ సినిమాని చాలా గర్వంగా గుండెలు నిండా దేశభక్తితో చూసి మన జవాన్స్‌కి ప్రేక్షకులు సెల్యూట్‌ కొడతారు. మన జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి ధైర్య సాహసాలను మీ ముందుకు తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం ఈ సినిమా. అందరిలోనూ దేశభక్తి ఉంటుంది. ఈ సినిమా చూశాక అది మరింత పెరుగుతుంది’’ అని అన్నారు.

Vraun 2.jpeg

మానుషి చిల్లర్‌ మాట్లాడుతూ '‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ప్రత్యేకమైన చిత్రం. వరుణ్‌ తేజ్‌ వండర్‌ ఫుల్‌ కోస్టార్‌. దర్శకుడు శక్తి ప్రతాప్‌ సింగ్‌ అద్భుతంగా ఈ సినిమాని తీశారు. ఇది నా కెరీర్‌ డ్రీమ్‌ రోల్‌గా మారిపోయింది’’ అని అన్నారు.

నవదీప్‌ మాట్లాడుతూ "తెలుగులో మొట్టమొదటి ఎయిర్‌ ఫోర్స్‌ యాక్షన్‌ సినిమా చేసిన ఘనత వరుణ్‌ తేజ్‌కి దక్కుతుంది.  ఇందులో నేను ఓ కీలకమైన పాత్ర పోషించా’’ అని అన్నారు.

దర్శకుడు శక్తి ప్రతాప్‌ సింగ్‌ మాట్లాడుతూ "సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశాం. యాక్షన్‌ డ్రామా ఫన్‌ ఎమోషన్‌ అన్ని ఎలిమెంట్స్‌ ఇందులో వున్నాయి. మార్చి 1 సినిమాను ఎంజాయ్‌ చేయండి’’అని అన్నారు. 

Updated Date - Feb 20 , 2024 | 04:59 PM