మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

OTT-Operation Valentine: ఓటీటీలో విడుదల.. ఎక్కడంటే!

ABN, Publish Date - Mar 22 , 2024 | 12:36 PM

వరుణ్‌ తేజ్‌ (Varun tej)హీరోగా నటించిన చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (Operation Valentine). మానుషి చిల్లర్‌ కథానాయిక. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వం వహించారు.


వరుణ్‌ తేజ్‌ (Varun tej)హీరోగా నటించిన చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (Operation Valentine). మానుషి చిల్లర్‌ కథానాయిక. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వం వహించారు. మార్చి ప్రారంభంలో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనకే పరిమితమైంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి స్ట్రీమింగ్  అవుతోంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా నేటి నుంచి తెలుగు, తమిళం భాషల్లో అందుబాటులో ఉంది.

కథ: అర్జున్‌ రుద్రదేవ్‌ అలియాస్‌ రుద్ర (వరుణ్‌తేజ్‌) భారతీయ వైమానిక దళంలో స్వ్కాడ్రన్‌ లీడర్‌. ‘ఏం జరిగినా చూసుకుందాం’ అంటూ దైర్య సాహసాలతో అడుగేసే  రకం. వైమానిక దళంలోనే పని చేసే రాడార్‌ ఆఫీసర్‌ అహనా గిల్‌ (మానుషి చిల్లర్‌)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ప్రాజెక్ట్‌ వజ్ర కోసం నడుం కట్టిన సమయంలో ఓ చేదు అనుభవం ఎదురవుతుంది. దాన్నుంచి కోలుకుంటున్న క్రమంలోనే ఆయన ఆపరేషన్‌ వాలెంటైన్‌ కోసం రంగంలోకి దిగుతాడు. ఆ ఆపరేషన్‌ వెనక ఉన్న కథేమిటి?  ప్రాజెక్ట్‌ వజ్ర లక్ష్యమేమిటి? తదితర అంశాలతో ఇది తెరకెక్కింది.

Updated Date - Mar 22 , 2024 | 12:39 PM