ఆట సందీప్ హీరోగా రేంజ్ రోవర్.. ‘ఊపలేని ఉయ్యాలలో’ పాట విడుద‌ల‌

ABN , Publish Date - Apr 23 , 2024 | 05:50 PM

ఆట సందీప్ హీరోగా నూత‌నంగా రూపొందుతోన్నచిత్రం రేంజ్ రోవర్. ఈ చిత్రంలోని ఓ పాటను ఇటీవలే విడుదల చేయగా మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది.

ఆట సందీప్ హీరోగా రేంజ్ రోవర్.. ‘ఊపలేని ఉయ్యాలలో’ పాట విడుద‌ల‌
sandeep

ఆట సందీప్ (Aata Sandeep) హీరోగా నూత‌నంగా రూపొందుతోన్నచిత్రం రేంజ్ రోవర్ (Range Rover). అన్ని కార్య క్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని ఓ పాటను ఇటీవలే విడుదల చేయగా మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది. ఈ సందర్భగా చిత్ర దర్శక నిర్మాత ఓఎస్ఆర్ కుమార్ (OSR Kumar) మాట్లాడుతూ 'రేంజ్ రోవర్' మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్ర‌మ‌ని, రీసెంట్‌గా నటుడు ఆలీ మా సినిమా ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశార‌న్నారు.

sandeep.jpeg

అదేవిధంగా విరించి పుట్ల రచించిన ‘ఊపలేని ఉయ్యాలలో’ (Oopaleni Vuyyalalo) పాటను రిలీజ్ చేశామ‌ని సింగర్ గోల్డ్ దేవరాజ్ పాడిన ఈ పాట ప్ర‌స్తుతం ట్రెండింగ్‌లోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ పాటను మా హీరో సందీప్ కోరియోగ్రఫీ చేశారన్నారు. ఈ పాటలానే సినిమాలోని అన్ని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయన్నారు.


అన్ని కమర్షియల్ అంశాలతో తెర‌కెక్కుతున్న ఈ రేంజ్ రోవర్ (Range Rover) సినిమా యూత్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. మా రేంజ్ రోవర్ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషలలో ఒకేసారి రిలీజ్ చేస్తున్నామ‌న్నారు.

sandee.jpeg

ఆట సందీప్, మేఘన రాజ్ పుత్, అరవింద్ యతిరాజ్, బ్యాంక్ జనార్ధన్ తది తరులు నటించిన ఈ చిత్రానికి సత్య సోమేష్ సంగీతం అందిస్తుండ‌గా ఇండియన్ పిక్చర్ పతాకంపై ఓఎస్ఆర్ కుమార్ నిర్మాత‌గా వ్య‌వహ‌రించ‌డంతో పాటు ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు.

Updated Date - Apr 23 , 2024 | 05:57 PM