Bandla Ganesh: చెక్‌ బౌన్స్ కేసులో శిక్ష, జరిమానా!

ABN , Publish Date - Feb 14 , 2024 | 02:42 PM

టాలీవుడ్‌ నిర్మాత బండ్ల గణేష్‌కు జైలు శిక్ష పడింది. చెక్‌ బౌన్స్‌ కేసులో ఆయనకు ఏడాది జెలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు తీర్పునిచ్చింది. శిక్షతోపాటు రూ.95 లక్షల జరిమాన విధించింది. జరిమానాతో పాటు కోర్టు ఖర్చులు కూడా చెల్లించాలంటూ తీర్పు వెల్లడించింది.

Bandla Ganesh: చెక్‌ బౌన్స్  కేసులో  శిక్ష, జరిమానా!


టాలీవుడ్‌ నిర్మాత బండ్ల గణేష్‌కు జైలు (Bandla Ganesh) శిక్ష పడింది. చెక్‌ బౌన్స్‌ కేసులో ఆయనకు ఏడాది జెలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు తీర్పునిచ్చింది. శిక్షతోపాటు రూ.95 లక్షల జరిమాన విధించింది. జరిమానాతో పాటు కోర్టు ఖర్చులు కూడా చెల్లించాలంటూ తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం ఈ టాపిక్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. 2019లో మద్దిరాడుకు చెందిన జానకిరామయ్య అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేశ్‌ రూ. 95 లక్షలు అప్పు తీసుకున్నారు. జానకి రామయ్య మరణాంతరం ఆయన తండ్రికి బండ్ల గణేశ్‌ రూ.95 లక్షల చెక్కు ఇచ్చారు. ఆ చెక్‌ బౌన్స్‌ కావడంతో జానకి రామయ్య తండ్రి కోర్టును ఆశ్రయించారు.  విచారణ చేపట్టిన న్యాయస్థానం బండ్ల గణేష్ కు జైలు  శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.

గతంలో కూడా కోర్టు ఆయనకు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. 2017లో బండ్ల గణేష్‌కు ఎర్రమంజిల్‌ కోర్టు ఆరునెలలు జైలుశిక్ష విధించింది. టెంపర్‌ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థ్థానం ఈ తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు 15 లక్షల 86 వేల 550 రూపాయలు జరిమానా  విధించింది. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్‌ బౌన్స్‌ కేసులో బండ్ల గణేశ్‌కు కోర్ట్‌ ఈ శిక్ష విధించింది. వెంటనే బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా.. షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది.
=  

Updated Date - Feb 14 , 2024 | 02:42 PM