OG: రూమర్లను ఖండించిన నిర్మాణ సంస్థ! 

ABN , Publish Date - Jan 08 , 2024 | 02:38 PM

పవన్‌కల్యాణ్‌ (pawan kayan) హీరోగా సుజీత్  (Sujith)దర్శకత్వంలో  డి.వి.వి దానయ్య నిర్మిస్తోన్న ‘ఓజీ’ (OG)చిత్రంపై వస్తున్న రూమర్లను నిర్మాణ సంస్థ ఖండించింది. 

OG: రూమర్లను ఖండించిన నిర్మాణ సంస్థ! 


పవన్‌కల్యాణ్‌ (pawan kayan) హీరోగా సుజీత్  (Sujith)దర్శకత్వంలో  డి.వి.వి దానయ్య నిర్మిస్తోన్న ‘ఓజీ’ (OG)చిత్రంపై వస్తున్న రూమర్లను నిర్మాణ సంస్థ ఖండించింది.  సినిమా నిర్మాణ బాధ్యతలు వేరే ప్రొడక్షన్‌ హౌస్‌ చేతికి వెళ్లాయంటూ జరుగుతున్న ప్రచారంపై చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ స్పందించింది. ‘‘ఓజీ’ మా సినిమా. ఎప్పటికీ మాదే. ఈ సినిమా ఎలా ఉండబోతుందో మాకు స్పష్టత ఉంది. ఆ దిశగా ముందుకు సాగుతున్నాం. ఆకలితో ఉన్న చిరుత దేనిని వదిలిపెట్టదు’’ అని ట్వీట్‌ చేసింది.

జపాన్, ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్‌ కథాంశంతో ఈ సినిమా సిద్థమవుతోంది. పవన్‌ సరసన ప్రియాంకా ఆరుల్‌ మోహన్‌ కథానాయికగా కనిపించనున్నారు. ఇమ్రాన్‌ హష్మీ, అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డి, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పవన రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల షూటింగ్‌ కాస్త ఆలస్యమవుతోంది. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తైనట్లు సమాచారం. గత ఏడాది హంగ్రి చీతా పేరుతో విడుదల చేసిన గ్లింప్స్‌ ఎంతగా ఆదరణ పొందిందో తెలిసిందే! 


Updated Date - Jan 08 , 2024 | 02:38 PM