Pawan kalyan - OG: ఓజీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌! 

ABN , Publish Date - Feb 06 , 2024 | 04:50 PM

నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా... శత్రువును ఎంచితే మొదలు వేట.. చూపుగాని విసిరితే ఓర కంట.. డెత్  కోటా కన్ఫర్మ్‌ అంట’’ ఈ లిరికల్ సాంగ్ సోషల్ మీడియాను ఓ ఊపు  ఊపిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు థియేటర్‌లో దద్దరిల్లే టైమ్‌ దగ్గరపడింది.

Pawan kalyan - OG: ఓజీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌! 

నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా...

శత్రువును ఎంచితే మొదలు వేట..

చూపుగాని విసిరితే ఓర కంట.

డెత్  కోటా కన్ఫర్మ్‌ అంట’’ ఈ లిరికల్ సాంగ్ సోషల్ మీడియాను ఓ ఊపు  ఊపిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు థియేటర్‌లో దద్దరిల్లే టైమ్‌ దగ్గరపడింది. పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్‌ (Pawan kalyan) హీరోగా నటిస్తున్న ఓజీ’ (OG) చిత్రం విడుదల తేదీ ఖరారు అయింది. ఈ  సెప్టెంబర్‌ 27న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు డి.వి.వి ఎంటర్‌టైనమెంట్‌ సంస్థ ట్విట్టర్‌ వేదిక ఓ కొత్త పోస్టర్‌ పోస్ట్‌ చేసి తెలిపింది. గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ఇతివృత్తంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సుజీత్  దర్శకుడు.  డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక ఆరుళ్‌ మోహన కథానాయిక. ఇమ్రాన హాస్మీ, అర్జున్  దాస్‌, ప్రకాష్‌రాజ్‌, శ్రియా రెడ్డి, హరీష్‌ ఉత్తమన్, అజయ్‌ఘోష్‌ కీలక పాత్రధారులు. తమన్ సంగీతం అందిస్తున్నారు. 


Og.jpg


Updated Date - Feb 06 , 2024 | 04:53 PM