Devara: ఎన్టీఆర్, కొరటాల మొదటి ప్రచార వీడియో వచ్చేసింది... ఎలావుందంటే...

ABN , Publish Date - Jan 08 , 2024 | 04:27 PM

ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా 'దేవర' మొదటి ప్రచార వీడియో విడుదల చేశారు. ఇది సముద్ర దొంగతనాలు నేపధ్యంగా వుండే కథ అని, ఒక యాక్షన్ సినిమా అని అర్థం అవుతోంది.

Devara: ఎన్టీఆర్, కొరటాల మొదటి ప్రచార వీడియో వచ్చేసింది... ఎలావుందంటే...
Devara first video glimpse is out

ఎన్టీఆర్ (NTR), దర్శకుడు కొరటాల శివతో (Koratala Siva) చేస్తున్న 'దేవర' #Devara మొదటి పార్టు ప్రచార వీడియో విడుదల చేశారు. ఈ సినిమా నేపధ్యం సముద్రం అని ఈ ప్రచార వీడియో ద్వారా అర్థం అవుతోంది. ఈ వీడియోలో ఒక పోరాట సన్నివేశాన్ని చూపించారు, అందులో ఎన్టీఆర్ కత్తి పట్టుకొని కొంతమంది దుండగులని నరుకుతూ పోతూ వుంటారు. చిన్న పడవల్లో ఒక షిప్ మీదకి వెళ్లి షిప్ లోని సరకును దోచుకొని రావటం ఆ తరువాత ఈ పోరాట సన్నివేశం ఇలా చూపించారు.

సముద్రం నేపధ్యంగా జరిగే దొంగతనాలు, షిప్ లను అడ్డగించటం, వాళ్ళ మధ్య జరిగే పోరాటం అని కూడా ర్థం అవుతోంది. అయితే ఇది చాలా చిన్న ప్రచార వీడియో ఇప్పుడు విడుదల చేశారు. సినిమా ఏప్రిల్ 5 న విడుదలవుతోంది. ఈలోపు ఈ సినిమా గురించి మరిన్ని ప్రచార వీడియోలు విడుదలచేసే అవకాశం వుంది.

ntrdevara.jpg

అప్పుడు ఈ సినిమా కథ గురించి మరికొంచెం వివరించే అవకాశం వుంది. ఇది అయితే ఒక యాక్షన్ సినిమా గా రూపు దిద్దుకుంటోంది అని మాత్రం అర్థం అవుతోంది. అయితే ఇందులో ఎన్టీఆర్ ఒక్కరే వుంటారా, లేకా అతను రెండు పాత్రల్లో కనపడతారా అన్నది ఇంకా సందేహంగానే వుంది. అలాగే ఈ పోరాట సన్నివేశం అయ్యాక, ఎన్టీఆర్ కి ఒక డైలాగ్ కూడా వుంది. "ఈ సముద్రం సేపల్ని కంటే, కత్తుల్ని, నెత్తురిని ఎక్కువ జూసిండాది, అందుకేనెమో దీన్ని ఎఱ్ఱసముద్రం అంటారు," అనే ఒక డైలాగ్ చెప్పారు. అలాగే సముద్రం వొడ్డున వున్న నీళ్లు ఎర్రగా ఉండటం కూడా చూపించారు.

Updated Date - Jan 08 , 2024 | 04:28 PM