Jr Ntr: నో వెకేషన్... ఫొకస్‌ అంతా దానిపైనే!

ABN , Publish Date - Mar 18 , 2024 | 03:51 PM

ఎన్టీఆర్‌ (ntr) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'దేవర’ (Devara). కొరటాల శివ (korarala siva) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవల రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగింది. సాధారణంగా వేసవి రాగానే స్టార్‌ హీరోలంతా విదేశాలకు వెకేషన్ కు వెళ్తారు.

 Jr Ntr: నో వెకేషన్... ఫొకస్‌ అంతా దానిపైనే!


ఎన్టీఆర్‌ (ntr) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'దేవర’ (Devara). కొరటాల శివ (korarala siva) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవల రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగింది. సాధారణంగా వేసవి రాగానే స్టార్‌ హీరోలంతా విదేశాలకు వెకేషన్ కు వెళ్తారు. కానీ ఈ వేసవిలో ఎన్టీఆర్‌ రెస్ట్‌ తీసుకోవడం లేదు. వెకేషన్ ప్లాన్ ఏమి లేదు వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు తారక్‌.  అందుకే ఫోకస్‌ అంతా ఈ సినిమాపై పెట్టాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలకమైన సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. యాక్షన్‌ పార్ట్‌ దాదాపుగా పూర్తయ్యింది. ఈ వారంలోనే చిత్ర బృందం గోవా వెళ్లబోతోంది. అక్కడ ఎన్టీఆర్‌, జాన్వీలపై ఓ పాటని, కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు.

ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. తొలి భాగాన్ని దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయనున్నారు. అనిరుథ్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ రెండు పాత్రల్లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ‘జనతా గ్యారేజ్‌’లాంటి హిట్‌ తర్వాత కొరటాల శివతో తారక్‌ చేస్తున్న చిత్రం కావడంతో అంచనాలు నెలకొన్నాయి.

Updated Date - Mar 18 , 2024 | 04:26 PM