scorecardresearch

Raj Tarun: ఆ రెండు సినిమాల పరిస్థితి ఏంటి?

ABN , Publish Date - Jul 24 , 2024 | 12:02 PM

యువ హీరో రాజ్‌ తరుణ్‌ (Raj Tarun) ప్రస్తుతం చిక్కుల్లో ఉన్నాడు. లావణ్య (lavanya) ఆరోపణలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఆమెపై పలు ఆరోపణలు చేసి కేసు పెట్టినా కానీ లావణ్య మాత్రం అతనే కోరుకుంటోంది.

Raj Tarun:  ఆ రెండు సినిమాల పరిస్థితి ఏంటి?


యువ హీరో రాజ్‌ తరుణ్‌ (Raj Tarun) ప్రస్తుతం చిక్కుల్లో ఉన్నాడు. లావణ్య (lavanya) ఆరోపణలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఆమెపై పలు ఆరోపణలు చేసి కేసు పెట్టినా కానీ లావణ్య మాత్రం అతనే కోరుకుంటోంది. ఏమైనా కానీ అతన్ని తన వశం చేసుకోవాలని ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది. ఈ తరుణంలో రాజ్‌తరుణ్‌ పరిస్థితి చిత్ర విచిత్రంగా ఉంది. ఎటూ అడుగేయలేని స్థితిలో ఉన్నాడు. బలంగా పోరాటం చేయలేకపోతున్నాడు.. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలకు న్యాయం చేయలేకపోతున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన రెండు సినిమాలు కేవలం ఒక వారం గ్యాప్‌ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆ సినిమాలు జనాల్లోకి వెళ్లాలంటే హీరోగా రాజ్‌తరుణ్‌ వచ్చి ప్రమోషన్స్  చేయాలి. కానీ రాజ్‌ తరుణ్‌ రెండు సినిమాల ప్రమోషన్స్  లోను కనిపించడం లేదు. (Raj tarun - Lavnya Case)

రాజ్‌ తరుణ్‌ నటించిన ‘పురుషోత్తముడు’ (Purushothamudu) ఈవారం విడుదల కానుంది. వచ్చే వారంలో ‘తిరగబడరా సామి’ (Tiragabadara saami) రాబోతుంది. చాలా కాలంగా సరైన సినిమా లేక ఖాళీగా ఉన్న రాజ్‌తరుణ్‌కి ఇది చాలా కీలకమైన సమయం. ఈ రెండు సినిమాల విజయాన్ని బట్టే అతని కెరీర్‌, హీరోగా మార్కెట్‌ ఉంటుంది. ఇప్పుడు అతని సినిమా నిలబడాలంటే ప్రమోషన్స్  కంపల్సరీ. కానీ రాజ్‌ తరుణ్‌ మీడియా ముందుకు రావడం లేదు. ‘ఈ సినిమా ప్రమోషన్లకు నేను రాను’ అంటూ నిర్మాతలకు చెప్పేశాడు. లావణ్యతో ఎఫైర్‌ బెడసికొట్టి పోలీస్‌ స్టేషన్,  కోర్టులు అంటూ కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు దేని కోసం వచ్చినా, టాపిక్‌ మళ్లీ తన పర్సనల్‌ లైఫ్‌ వైపు మళ్లుతుందని, దాని వల్ల లేని పోని సమస్యల చుట్టుకొంటాయని భయపడుతున్నాడు రాజ్‌ తరుణ్‌. అందుకే ప్రమోషన్లలో కనిపించడం లేదు. ‘పురుషోత్తముడు’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ హైదరాబాద్‌ లో ఓ హోటెల్‌ లో జరిగింది. ఈ కార్యక్రమం హీరో లేకుండానే జరిగింది. ఇంటర్వ్యూలోనూ రాజ్‌ తరుణ్‌ దర్శనం లేదు. రాజ్‌ తరుణ్‌ బాధని అర్థం చేసుకొన్న నిర్మాతలు పైకి ఏమీ మాట్లాడలేకపోతున్నారని టాక్‌. ఏ సినిమాకు అయినా హీరో చేసిన ప్రచారమే బూస్ట్‌ ఇస్తుంది. మరి రాజ్‌ తరుణ్‌ నటించగా విడుదలకు సిద్ధమైన రెండ చిత్రాల పరిస్థితి ఏంటి అన్నది చూడాలి. 

Updated Date - Jul 24 , 2024 | 03:18 PM